కేరళ బోటు ప్రమాదం విచారకరం.. పవన్ ఆవేదన

0
110

కేరళ బోటు ప్రమాదం విచారకరం అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈమేరకు ప్రకటన విడుదల చేశారు పవన్ కళ్యాణ్. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా తువల్ తీరం బీచ్ సమీపంలో హౌస్ బోట్ బోల్తా పడ్డ దుర్ఘటనలో 22 మంది దుర్మరణం పాలవడం విచారం కలిగించింది.

విహార యాత్రకు వచ్చి ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా చనిపోవడం దిగ్భ్రాంతికరం.మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉండటం అత్యంత విషాదకరం.మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

పర్యాటకంగా అభివృద్ధి చెందిన కేరళలో ఇటువంటి ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరం.ఈ ప్రమాదాన్ని ప్రతి రాష్ట్ర పర్యాటక శాఖ ఒక పాఠంగా తీసుకోవాలి.పాపికొండలు పర్యాటక బోటు ప్రమాద ఘటనను ఎవరం మరచిపోలేదు.ప్రధానంగా జల విహారానికి సంబంధించిన ప్రాంతాల్లో నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here