శనివారం ఉదయం నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.. కాగా ఈ విషయం పైన సినీ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా తీర్వ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.. కాగా నిన్న చంద్రబాబు అరెస్ట్ ని ఖండిస్తూ పవన్ కళ్యాణ్ వీడియోని విడుదల చేసారు..
కాగా విజయవాడలో పోలీసుల ఆధీనంలో ఉన్న చంద్రబాబుని పరామరసించేదుకు మరియు జనసేన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చేందుకు సన్నాహాలు చేసుకున్నారు పవన్.. కాగా పవన్ కళ్యాణ్ విజయవాడ వస్తే శాంతిభద్రతలు లోపించే అవకాశం ఉందని కనుక విజవాడా వచ్చేందుకు పవన్ కి అనుమతులు ఇవ్వొద్దని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గన్నవరం విమానాశ్రయం అధికారులకు మెయిల్ పంపారు.
ఈ నేపథ్యంలో విమానాశ్రయ అధికారులు పవన్ కి ఇచ్చిన అనుమతులని రద్దు చేసారు.. దేనితో విమానాశ్రయం నుండి వెనుదిరిగిన పవన్ రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు చేరుకోవాలి అనుకున్నారు .. అనుకున్నట్టుగానే రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు వస్తున్న పవన్ కళ్యాణ్ వాహనాన్ని గరికపాడు వద్ద పోలీసులు నిలిపివేశారు..
దేనితో పోలీసుల తీరుపైనా అసహనం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ అక్కడే హైవే పైన పడుకుని నిరసన తెలిపారు.. దీనితో ట్రాఫిక్ నిలిచిపోయింది.. పవన్ కళ్యాణ్ మీడియా తో మాట్లాడుతూ హైద్రాబాద్ నుండి ఆంధ్ర రావాలంటే పాస్పోర్ట్ వీసా తప్పనిసరి అనేల ఉంది జగన్ ప్రభుత్వం తీరు..
శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులది.. దానితో వైసిపీ నాయకులకి ఏంటి సంభంధం? అనుభవం కలిగిన నాయకుడి పట్ల ప్రస్తుతం పోలీసులు చూపిస్తున్న వైకిరి నిజంగా అమానుషం.. ఒక నాయకుడిని అకారణంగా జైల్లో పెడితే అభిమానులు బయటకి వస్తారు ఆనాయకునికి మద్దతు ఇస్తారు ఇది ప్రజాస్వామ్యంలో భాగమే.. ఒక క్రిమినల్ చేతిలో అధికారం ఉంటె పరిస్థితి ఎలా ఉంటుందో ప్రస్తుతం రాష్ట్రమంతా చూస్తుంది.. అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.. అనంతరం అక్కడి నుండి బయలుదేరినప్పటికీ మళ్లీ అనుమంచిపల్లి వద్ద మరోసారి పోలీసులు జనసేనాని వాహనాన్ని ఆపేశారు.