పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పేరుకు తగ్గట్టే ఉంటుంది పవన్ శైలి.. మానవత్వంతో ఎదుటి వ్యక్తి సాయం చెయ్యడానికైనా.. అనవసరంగా పోరుకి కాలు దువ్వితే పోట్లాడడానికైనా పవన్ ముందుంటాడు.. ఎప్పుడు ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేసే పవన్ జనం కోసమే నేనంటూ జనసేన పార్టీని స్థాపించారు.. ప్రస్తుతం అయన అటు రాజకీయాలలోను ఇటు సినిమాలలోనూ బిజీగా ఉన్నారు..ప్రస్తుతం పవన్ చేతిలో ౩ సినిమాలు ఉండగా.. వాటిలో ఓజి అభిమానులను ఊరిస్తుంది..నిన్నటివరకు ఈ సినిమా తో పవన్ పేరు మారుమోగింది.. కాగా నిన్న సాయంత్రం నుండి పవన్ పేరు అంతకు మించి వినబడుతుంది.. పవన్ దూకుడు కి అందరికి పట్టపగలే చుక్కలు కనిపించి చమటలు పట్టాయి.. వివరాలలోకి వెళ్తే
నిన్న చంద్రబాబు అరెస్ట్ పైన పవన్ స్పందిచిన తీరు.. అలానే చంద్రబాబుని పరామర్శించడానికి వెళ్తున్న సమయంలో ఆయన్ని అడ్డుకున్న పోలీసుల వైకిరి పైన మాట్లాడిన విధానం, ఆయన దూకుడు, తీసుకున్న నిర్ణయాలతో మరోసారి ఆయన పేరు తార స్థాయిలో వినబడుతుంది.. దీనితో ప్రస్తుతం పవన్ పేరు అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ మారుమ్రోగుతుంది..
కాగా పవన్ కి ఉన్న క్రేజ్ ని చూసి తమిళ్ సినీ అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.. ఆ ఆశ్చర్యంలోనే నిన్నటి దృశ్యాలని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఎక్స్ ట్రెండింగ్ లో పవన్ పేరు నిలిచింది.. కాగా ఆ దృశ్యాలని నెటిజన్స్ మరింతల షేర్ చేస్తున్నారు.. మరి ఆలస్యం ఎందుకు మీరు ఆ దృశ్యాలని చూసేయండి.