తాజాగా విజయవాడ లో నిర్వహించిన మాతృభాష మహాసభకు పలు రాజకీయ పార్టీ అభ్యర్థులు హాజరు అయ్యారు.. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, కాంగ్రెస్ మీడియా ఇంఛార్జ్ తులసీరెడ్డి, జనసేన అధికార ప్రతినిధి కందుల దుర్గేష్, మాజీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, సీపీఐ నాయకురాలు అక్కినేని వనజ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రస్తావిస్తూ.. ఉపాధ్యాయ దినోత్సవం రోజే మాతృభాష మహాసభను ఏర్పాటు చేయడం చాల గొప్పవిషయం.. తెలుగు భాష త్రిలింగం అనే పదం నుంచీ వచ్చింది.. దక్షిణ ఆసియాలో 24 ద్రవిడ భాషల్లో అత్యధిక మంది వాడే భాష తెలుగు.. అత్యంత సుందర లేఖనం కలిగిన భాష కూడా తెలుగే..
ఎన్టీఆర్ మమ్మల్ని మిషనరీ స్కూలులో చేర్పించారు.. ఆయన మాకు ఒక మాస్టర్ ను పెట్టి మరీ తెలుగు నేర్పించారు.. ఇంగ్లీషు పేరు చెప్పి తెలుగును అగౌరవపరచ కూడదు.. భాష మాతృభాషగ మారింది అంటే అంతరించిపోయే దశలో ఉన్నట్టు.. మన సంస్కృతి, సాంప్రదాయం తెలుగు సాహిత్యంలో నిక్షిప్తమై ఉన్నాయి..మాతృభాషా అంతరించి పోతే మన సంస్కృతి సాంప్రదాయం కూడా అంతరించిపోయే అవకాశం ఉంది.. ప్రస్తుత పరిస్థితులని చూస్తుంటే తెలుగు అంతరించిపోతుందేమో అనే ఆందోళన కలుగుతుంది..అని ఆమె పేర్కొన్నారు..
అనంతరం కాంగ్రెస్ మీడియా వ్యవహారాల ఇంఛార్జ్ తులసీరెడ్డి వ్యాఖ్యానిస్తూ.. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో ఏడవ భాష తెలుగు.. మన దేశంలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య నాల్గొవ స్థానంలో ఉంది.. శ్వాస ఆగిపోతే మనిషి చనిపోతాడు.. భాష ఆగిపోతే జాతి చనిపోతుంది.. అలాంటి తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈష్ట్ అని నికోలిస్ పేర్కొన్నారు అని తులసీ రెడ్డి తెలిపారు..