Sai Priya Starts New Drama In Vizag Police Station: వైజాగ్ బీచ్ వద్ద మాయమైనప్పటి నుంచి సాయిప్రియ ఇస్తోన్న ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు. త్రిల్లర్ సినిమాని మించి షాక్‌లు ఇస్తోంది. సముద్రంలో గల్లంతై, బెంగుళూరు ప్రత్యక్షమైన ఈ అమ్మాయి.. తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడంటూ తొలుత షాకిచ్చింది. ఆ వెంటనే అతనితో పెళ్లయ్యిందంటూ మరో ఝలక్ ఇచ్చింది. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న ఆమె.. పోలీస్ స్టేషన్‌లోనే మరో కొత్త డ్రామాకు తెరలేపింది.
బెంగుళూరులో ఉన్న సాయిప్రియ దంపతుల్ని పోలీసులు విశాఖకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే! తాము దొరికిపోయాం కాబట్టి, ఎక్కడ భరతం పడతారోనన్న భయంతో, అప్పుడు మరో కొత్త కథ స్టార్ట్ చేసింది. బంధువుల నుంచి తనకు, ప్రియుడు రవికి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేసింది. దీంతో.. సాయిప్రియ భర్త శ్రీనివాస్‌ను స్టేషన్‌కి పిలిచించి, ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. సాయిప్రియ మేజర్ కావడం వల్ల.. ఆమెకు ఇష్టప్రకారం నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉంటుందని పోలీసులు అంటున్నారు.
ఫ్యూజులు ఎగిరిపోయే మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. మ్యారేజ్ డే సందర్భంగా భర్త శ్రీనివాస్ ఎంతో ప్రేమగా ఇచ్చిన బంగారు గాజుల్ని సాయిప్రియ అమ్మేసింది. ఆ అమ్మిన డబ్బులతోనే ప్రియుడు రవితో కలిసి జల్సాలు చేసింది. రెండో రోజులపాటు సరదాగా గడిపింది. సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది అంటే ఇదే! మరి.. భర్త శ్రీనివాస్ పరిస్థితి ఏంటి?