మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు చంద్రబాబు తీరు..!

0
169

చంద్రబాబు కుప్పం పర్యటనలో జరిగిన పరిణామాలు, పవన్‌ కల్యాణ్‌ టూర్‌పై కామెంట్లు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… వైసీపీ విముక్త ఏపీ అని అంటున్నారు.. అంటే పేద ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం ఏమీ ఉండకుండా చేయటమే తన లక్ష్యం అని చెప్పినట్టే అన్నారు.. ఇలా తెలిసే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారో… ఎవరైనా చెబితే చేస్తున్నారో? అని ఎద్దేవా చేశారు. పేదల ఆకలి నిజంగా తీర్చాలనుకుంటే చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను 2014లో ఎందుకు తీసుకుని రాలేదు? 2019లో ఎన్నికల ముందు ఎందుకు చేశారు? ఆ చేసిన కొంచెం లో కూడా అక్రమాలే అంటూ ఆరోపణలు గుప్పించారు. ఇక, రేపు కూడా చంద్రబాబుకు కుప్పంలోనే ఉంటారు.. ఇవాళ రోడ్డు మీద కూర్చున్నాడు… రేపు పొడుకుంటాడేమో? అంటూ ఎద్దేవా చేశారు సజ్జల.. చంద్రబాబు ఆడే డ్రామాలు హింసాత్మకంగా మారుతున్నాయని ఫైర్‌ అయిన ఆయన.. నిన్న కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు.

చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్న జెండాలు, ఫ్లెక్సీలు పీకేశారు. కొంత మంది మా కార్యకర్తలకు గాయాలు కూడా అయ్యాయి. ఇవాళ చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడారంటూ మండిపడ్డారు. ఇవాళ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం చేశారు. చంద్రబాబు పర్యటన ఉంటే కార్యకర్తలు కర్రలు తీసుకుని ఎందుకు వెళ్ళారు? అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న ఊర్లో ఎందుకు విద్వేషం, హింస ప్రేరేపిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు తిరిగి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు..! అని సెటైర్లు వేశారు. వైసీపీ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలపటానికి ప్రయత్నిస్తే దాడి చేశారు.. ఇదేం రాజకీయం? అంటూ అసహనం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే హక్కు చంద్రబాబుకు ఎవరు ఇచ్చారు? అని నిలదీసిన ఆయన.. అసలు అది అన్న క్యాంటీనా? అని ప్రశ్నించారు. టీడీపీకి, చంద్రబాబుకు ప్రజలతో సంబంధం ఉండదు.. చంద్రబాబువి దరిద్రపుగొట్టు ఆలోచనలు.. శిశుపాలుడి తప్పుల్లా చంద్రబాబు చేసిన తప్పుల్ని జగన్ పాదయాత్రలో ప్రజలకు వివరించారని చెప్పుకొచ్చారు.. చంద్రబాబు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు.. చంద్రబాబు నిజం చెబితే కదా ప్రజలు నమ్మటానికి.. చంద్రబాబును రాష్ట్రంలోనే కాదు ప్రజలు కుప్పంలోనూ తిరస్కరించారు.. కుప్పంలో పార్టీ ఆఫీసును చంద్రబాబు ఇవాళ ప్రారంభించటం సిగ్గు చేటు కాదా? అని ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here