పోయాడని అంత్యక్రియలు చేశారు.. కర్మకాండల రోజు షాక్‌ ఇచ్చాడు..

0
174

చనిపోయాడని భావించిన ఓ మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.. తీరా కర్మకాండల రోజు… అంతా భోజనాలు చేస్తున్న సమయంలో ప్రత్యక్షమై షాక్‌ ఇచ్చాడో వ్యక్తి.. 40 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆయన.. సడెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు.. చనిపోయాడు అనుకున్న వ్యక్తి ఒక్కసారిగి ప్రత్యక్షం కావడంతో.. మొదట షాక్‌ తిన్న కుటుంబ సభ్యులు తర్వాత ఆనందంలో మునిగిపోయారు.

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో ఈ విచిత్ర ఘటన జరిగింది.. ముర్లపాడుకు చెందిన సయ్యద్ మియా అనే వ్యక్తి 40 రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయాడు.. అయితే, ఇటీవల పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.. అతడికి సయ్యద్ మియాకు దగ్గరి పోలికలు ఉండడంతో.. చనిపోయిన మరో వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు… కర్మకాండలు నిర్వహించి బంధువులకు భోజనాలు పెడుతున్న సమయంలో చనిపోయాడు అనుకున్న వ్యక్తి ప్రత్యక్షమై అందరికీ షాక్‌ ఇచ్చాడు. ఊహించని ఘటనతో అవాక్కైన కుటుంబ సభ్యులు, బందువులు.. చనిపోయాడనుకున్న సయ్యద్ మియా తిరిగి రావటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here