తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన సీఐ అంజూ యాదవ్ ఓవర్ యాక్షన్ మరో సారి బట్టబలైంది. రాత్రి 10 అవుతున్నా హోటల్ ఎందుకు తెరిచి ఉంచారని, నీ భర్త ఆచూకీ చెప్పాలని ధనలక్ష్మి అనే మహిళను గత రాత్రి విచక్షణా రహితంగా కొట్టి, పోలీస్ స్టేషన్ కు తరలించారు సీఐ.. తన ఆరోగ్యం భాగోలేదని.. ఆపరేషన్ అయ్యిందంటూ ఆ మహిళ మొరపెట్టుకున్నా కనికరించకుండా విరుచుకుపడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నడి రోడ్డుపై మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించి, చీర ఊడిపోయేలా కొట్టి, బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కించిన దృశ్యాలను స్థానికులు మొబైల్ ఫోన్లో చిత్రీకరించడంలో సీఐ అంజూ యాదవ్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. తనను కొట్టవద్దని ధనలక్ష్మి ఏడుస్తూ బతిమలాడిన కూడా కనికరం చూపకుండా దాడికి పాల్పడింది. ప్రస్తుతం బాధితురాలు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. గతంలో 20వేల లంచం అడిగిందని ఇవ్వకపోవడంతో తమపై కక్షగట్టిందని బాధితురాలి భర్త హరినాయుడు అన్నారు. తన భార్యకు ఇటీవలే పెద్ద ఆపరేషన్ జరిగిందని సీఐ కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిందని తెలిపాడు. తన తల్లిని కొట్టొదని కొడుకు ముని ఈక్షిత్ ప్రాధేయపడ్డితే ఆ యువకుని టీషర్ట్ చింపేసి, అడ్డొస్తే గంజాయి కేసులు పెట్టి లోపల వేస్తానని బెదిరించినట్లు ముని ఈక్షిత్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు సీఐ అంజూ యాదవ్ వల్ల ప్రాణహాని ఉందని ఆమె బారినుండి నా కుటుంబాన్ని రక్షించాలని హరినాయుడు ప్రాథేయపడుతున్నాడు.