వావ్… టీటీడీ యాప్ కి సూపర్ రెస్పాన్స్

0
926

కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతుంటారు. టీటీడీ దర్శనం టికెట్లు జారీచేసిన, ఏ పథకం ప్రారంభించినా దానికి వెంటనే స్పందిస్తారు భక్తులు. తాజాగా టీటీడీ ప్రారంభించి యాప్ కి భక్తుల నుంచి ఆదరణ భారీగా కనిపిస్కతోంది. రెండు రోజులలోనే యాప్ ని డౌన్ లోడ్ చేసుకున్న భక్తుల సంఖ్య 10 లక్షలు దాటేసింది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు.. టోకెన్‌ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,639 మందిగా ఉంది. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.16కోట్లు అని టీటీడీ తెలిపింది. తలనీలాలు సమర్పించిన వారు 25131 మంది.

మరోవైపు టీటీడీ ధార్మిక కార్యక్రమాలకు హిందు సాధు సంఘం మద్దతు తెలిపింది. తిరుమలలో నిర్వహిస్తున్న హిందూ ధార్మిక కార్యక్రమాలపై సాధు సంఘం స్వామిజీలకు వివరించారు టీటీడీ ఇఓ ధర్మారెడ్డి. టీటీడీ నిర్వహిస్తూన్న కార్యక్రమాల పై సంతృప్తి వ్యక్తం చేశారు స్వామిజీలు. సోషల్ మీడియా వేదికగా టీటీడీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు తమ నెట్ వర్క్ ద్వారా సహకారం అందిస్తామన్నారు స్వామీజిలు.

ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసుకోవచ్చని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విరాళాలు కూడా ఇదే యాప్‌ నుండి అందించవచ్చని ఆయన చెప్పారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ యాప్‌ను రూపొందించింది. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చు. ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా యాప్‌లో చూడవచ్చు. ఇక భక్తులకు పూర్తి సమాచారం అందించడంలో..డిజిటల్‌ గేట్‌ వేగా ఈ యాప్‌ ఉపయోగపడుతుందని ఈవో ధర్మారెడ్డి అంటున్నారు. భక్తులు లాగిన్‌ అయ్యేందుకు యూజర్‌ నేమ్‌తోపాటు OTP ఎంటర్‌ చేస్తే చాలని, పాస్‌వర్డ్‌ అవసరం లేదని ఈవో తెలిపారు. గతంలో టీటీడీకి ఉన్న గోవింద యాప్‌ లో ఉన్న సమస్యలు ఎదురయ్యాయి. దీంతో టీటీడీ ఈ సరికొత్త యాప్ ని తీసుకువచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here