ఏపీలో ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణం అవుతోంది. వైసీపీ అంటే రాజకీయ పార్టీనా… రాసలీల పార్టీనా అని అందరూ చర్చించుకుంటున్నారన్నారు టీడీపీ మహిళా నేత ఆచంట సునీత. ఆకు రౌడీలకు, ఆర్ధిక నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా వైసీపీ మారింది. యథా రాజా.. తథా ప్రజా అన్నట్లుగా వైసీపీ ఉంది. పార్టీ అధ్యక్షుడు జగనే నేరస్థుడు కావడం వల్ల .. ఆయన పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అదే బాట పడుతున్నారు.
ఎన్నికల అఫిడవిట్‌లో మాధవ్ పై కేసులు ఉన్నాయని తెలిసినా కూడా జగన్ వారికి ఎందుకు సీట్లు ఇచ్చి ప్రోత్సహించారు. వైసీపీ ఫ్యాన్ గుర్తు తీసేసి.. గంట గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని ప్రజలు అందరూ అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక మంత్రి అరగంట అంటాడు, ఇంకో మంత్రి గంట అంటారు. అటువంటి వారిని ప్రోత్సహించి మరీ మంత్రి పదవులు ఇచ్చారు. వాలంటీర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన జోగి రమేష్‌కు మంత్రి పదవి ఇచ్చారు. గోరంట్ల మాధవ్ చేసిన పనికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు సిగ్గుతో తలదించుకొని బాధ పడుతున్నారు. గోరంట్ల మాధవ్ చేసిన నీచపు పనికి పార్టీలకు అతీతంగా మహిళలు అంతా చెప్పులతో కొట్టాలి.. లేదా కాల్చి చంపాలని భావిస్తున్నారు.