మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్రం రావణ కాష్ఠగా మారింది.. ఎక్కడ చూసిన తెలుగుదేశం నాయకులూ కార్యర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు..తెలుగు దేశం శ్రేణులు నిరసనల మృదంగం మోగిస్తున్నారు..
ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రం లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. కొవ్వొత్తులు, కాగడాలతో మా నాయకున్ని విడుదల చెయ్యాలంటూ నినాదాలు చేస్తున్నారు.. NTR జిల్లా మైలవరంలో నిరసన చేసిన తెలుగుదేశం యువత అధ్యక్షుడిని పోలీసులు అరెస్ట్ చేసారు.. దీనితో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసున్నాయి..
వీరుల పాడులోను ఇదే పరిస్థితి పార్టీ కార్యకర్తలు నిరసన తెలియచేసారు..తిరువూరులో మధిర రోడ్డు సెంటర్ నుండి చీరాల వరకు ర్యాలీ నిర్వహించారు.. ఈ తరుణంలో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది..
గుడివాడలోను కార్యకర్తలు వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో కాగడాల తో నిరసన తెలిపారు..
ఈ ప్రదర్శనను అడ్డుకోవాలి అని పోలీసులు ప్రయత్నిచిగా.. కార్యకర్తలకి మరియు పోలీసులకి నడుమ వాగ్వవాదం జరిగింది.. .పల్నాడు జిల్లా నరసరావుపేటలోను కాగడాలతో ర్యాలీ చేసారు.. సీఎం జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు..
బాపట్ల జిల్లా చీరాల లోను గడియారస్తంభం కూడలిలో ధర్నా నిర్వహించారు టీడీపీ కార్యకర్తలు.. ప్రకాశం జిల్లా, కనిగిరి, నెల్లూరు,కలిగిరి,వరికుంటపాడు, ఉదయగిరి, సీతారాంపురం, కడప, కర్నూలు, కుప్పం, నరసన్నపేట, ఉమ్మడి విజయనగరం ఇలా రాష్ట్రం లో దాదాపు అన్ని చోట్ల కార్య కర్తలు నిరసనలు చేస్తూ చంద్రబాబుకి మద్దతు గా నిస్తున్నారు..జగన్ డౌన్ డౌన్, చంద్రబాబుని విడుదల చెయ్యాలి అంటూ నినాదాలు చేస్తున్నారు..