నాన్న తాగితేనే పిల్లవాడికి అమ్మఒడి., భర్త తాగితేనే భార్యకు చేయూత.. కొడుకు తాగితేనే తల్లికి పెన్షన్..!

0
554

ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వ పథకాలు.. మద్యం అమ్మకాలను ప్రస్తావిస్తూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై సెటైర్లు వేశారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు… నాన్న తాగితేనే పిల్లవాడికి అమ్మఒడి… భర్త తాగితేనే భార్యకు చేయూత.. కొడుకు తాగితేనే తల్లికి పెన్షన్.. ఇదే వైసీపీ ప్రభుత్వ సంక్షేమ విధానం అంటూ సెటైర్లు వేశారు.. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న వైఎస్‌ జగన్ విశ్వనీయత ఏమైంది..? అని నిలదీసిన ఆయన.. ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో జగన్ పలికినవన్నీ అసత్యాలేనని ఆరోపించారు.. ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో జగన్ ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోస్తూ విషం కక్కారు అంటూ ఫైర్‌ అయ్యారు.

ఇసుక రద్దుతో భవన కార్మికులు రోడ్డున పడేసి ఉద్ధరించినట్లు మాట్లాడారని సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు నిమ్మల రామానాయుడు.. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గౌరవంగా బతకడానికి కారణం చంద్రబాబేనన్న ఆయన.. రెండు వందల పెన్షన్ ను రెండు వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే అన్నారు.. వైఎస్‌ జగన్ ప్రమాణస్వీకారం రోజున పెన్షన్ రూ. 3 వేలు చేస్తానని సంతకం పెట్టిన ఫైల్ కు నేడు దిక్కులేదని ఆరోపించారు.. ఏ వార్డు, వీధులకెళ్లినా పెన్షన్ రద్దు చేశారని ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. 3, 4, 5 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేయడంతో విద్యార్థులు కాలువలు, చెరువులు, స్మశానాలు దాటి స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here