Telugu Language Day Celebrations:ఆంధ్రాలో ఆరంభమైన తెలుగు వారోత్సవాలు

0
43

వెన్నెల్లో ఆటలు.. వేటూరి పాటలు.. అమ్మ నేర్పిన మాటలు ఎప్పటికి మధురంగానే ఉంటాయి.. కానీ ప్రస్తుతం పాశ్యాత దేశాల మోజులో కట్టు బొట్టు మార్చేస్తున్నాం.. ఆంగ్ల భాష వ్యామోహంతో మాతృభాషని మర్చిపోతూన్నాం.. ప్రస్తుత సమాజంలో చాలామంది పిల్లలు తెలుగు రాయడం, చదవడం అంటుంచి కనీసం స్పష్టంగా మాట్లాడలేకున్నారు అంటే అది అతిశయోక్తి కాదు.. దీనికి కారణం పాఠాశాలల్లో తెలుగుని మాట్లాడనీకపోవడం.. తల్లిదండ్రులు అలాంటి పాఠశాలాలనే ఎంచుకోవడం.. మనకి ఆంగ్లభాష ఎంత అవసరమో.. మాతృభాష అంతకంటే ఎక్కువ అవసరం.. అందుకే అన్ని దేశాలు మాతృభహకి ఎంతో ప్రాముక్యతని ఇస్తాయి..అంతెందుకు మనదేశంలో ఆంధ్ర తప్ప అన్ని రాష్ట్రాలు మాతృభాషకి ఎంతో విలువనిస్తాయి అని తెలుగు చరిత్రకారుల అభిప్రాయం..

దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించబడిన తెలుగు భాష ఈ రోజు తెలుగువాళ్లకే చేదైనది, పొరుగింటి పుల్లకూర రుచని ఆ అర్ధంకాని ఆంగ్ల భాష ప్రాణమైనది.. అని తెలుభాష ప్రేమికులు, పండితులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు.. మరుగునపడుతున్న మాతృభాషకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఎందరో కృషి చేశారు.. వాళ్ళల్లో తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి ఒకరు..

ఆయన 160 వ జయంతి సందర్భగా నిన్న ఏపీ తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు మాట్లాడుతూ..నేటి నుంచి 29 వరకు వారం రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.. సీఎం జగన్ ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు..

ఈ వేడుకల్లో భాగంగా ఈ వారోత్సవాలను అన్ని జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రధానంగా గుంటూరు, విజయవాడ కేంద్రాల్లో ఘనంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. వారోత్సవాల్లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు, రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులకు కథలు, కవితలు, అంత్యాక్షరీ పోటీలు నిర్వహిసామని విజయబాబు అన్నారు.
నిత్య జీవితంలోనూ, పాలనా వ్యవహారాల్లోనూ తెలుగు భాషను ప్రోత్సహించడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా వారం రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుతున్నామని విజయబాబు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here