దేవుడు ప్రతి చోట ఉండలేక తల్లిని సృష్టించాడు అంటారు.. ఎందుకంటే ఈ లోకంలో అమ్మ ప్రేమని మించిన ఆస్తి లేదు.. రంగు, రూపు ఎం చూడకుండానే కడుపులో ఉన్నదీ పాప, బాబు నా అనే ఆలోచించకుండానే.. అణువువుగా కడుపులో ప్రాణంపోసుకున్నప్పటి నుండి కంటిపాపాల చూసుకుంటుంది..
తాను కన్ను మూసేవరకు కంటికి రెప్పలా కాసుకుంటుంది.. తెలిసోతెలియకో చేసిన తప్పులని కడుపులో దాచుకుంటుంది.. అలాంటి అమ్మ ఆగ్రహిహిస్తే భద్రఖాళీగా మారుతుంది.. .సహనం నశిస్తే భూమి కూడా కంపిస్తుంది.. అలానే అమ్మ కూడా ఓపిక నశిస్తే ఊపిరి ఆపడానికి కూడా ఆలోచించదు. ఇలాంటి ఘటనలు కోకొల్లలు..అలాంటి సంఘటనే తాజాగా విజయవాడ లో చోటు చేసుకుంది..
వివరాలలోకి వెళ్తే.. విజయవాడలో దేవ్ కుమార్ అనే వ్యక్తితో తల్లి చెల్లి తో కలిసి నివాసం ఉంటున్నాడు.. కాగా దేవ్ కుమార్ మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు బానిసగా మారాడు.. నిత్యం తాగొచ్చి తల్లి తో గొడవపెట్టుకునే వాడు.. మద్యంకి డబ్బులు ఇవ్వాల్సిందిగా తల్లిని వేధించే వాడు..
ఆ వేధింపులకు సహనాన్ని కోల్పోయిన తల్లి కడుపునా పుట్టిన కొడుకుని చంపేసింది.. ఈ హత్యకి దేవ్ కుమార్ చెల్లి మరియు అలీఖాన్ అనే మరో వ్యక్తి ఆమెకు సంహరించారు.. అనంతరం మేము పనికి వెళ్లి వచ్చేసరికి దేవ్ కుమార్ చనిపోయి ఉన్నాడని పోలీసులకి ఫిర్యాదు చేసింది తల్లి.. దీనితో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేస్ నమోదు చేసుకున్నారు.. చివరికి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఆధారంగా దర్యాప్తు చేయగా దేవ్ కూమార్ మృతి హత్యగా గుర్తించారు పోలీసులు. మృతుడి తల్లిని, చెల్లిని సహకరించిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.