వరుస తుఫాన్లు పంటలను తుడిచిపెట్టుకుపోతే సకాలంలో వర్షాలు లేఖ నారు మడులు ఎండిపోతున్నాయి. అధికారుల అలసత్వంతో ప్రతి ఏటా తోటపల్లి రైతులు అవస్దలుపడుతున్నారు. రాష్ట్రంలో వ్యవసాయాధారిత జిల్లాలో శ్రీకాకుళం జిల్లా ఒకటి. ఈ జిల్లాలో సుమారు 2,39,702 హెక్టార్ల సాగు భూమి ఉంది. ఈ మెత్తం సాగుభూమిలో ఖరీఫ్, రబి రెండు పంటలు పండిస్తున్నప్టటికీ ఖరీఫ్ లో ఎక్కువ శాతం వరి పండిస్తారు. జిల్లా మొత్తం మీద సుమారు 2 లక్షల హెక్టార్లలో వరి పంటను పండిస్తున్నారు. జిల్లాలో వ్యవసాయం అంతా ఎక్కువగా వంశధార,నాగావళి నదులపై ఉన్న ఆనకట్టలపై ఆధారపడి ఉంటుంది.
కొన్ని మండలాలు మాత్రం వర్షాధారంపై ఆధారపడి ఉన్నాయి. వీటిలో రణస్థలం, లావేరు, సారవకోట, పోలాకి, ఎచ్చెర్లలో కొంతభాగం వర్షాధారం మీద ఆధారపడిన మండలాలు ఉన్నాయి. తోటపల్లి ప్రోజెక్ట్ పై ఆధారపడి ప్రతి ఏటా పంటలు వేయటం అధికారుల నిర్లక్ష్యంతో పాలకొండ , వీరఘట్టాం , రేగిడి మండలాలల్లో సాగునీరు అందటంలేదు . నైరుతి రుతు పవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మెదట్లో వర్షాలు కురవడంతో రైతాంగమంతా వరి సాగుకు పూనుకున్నారు. గతంలో మాదిరి వరినాట్లు వేయకుండా ఎద సాగువైపు మెగ్గు చూపారు. కానీ గత కొన్ని రోజులుగా వరుణుడు ముఖం చాటేసాడు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలను నమోదు కావడంతో జిల్లాలోని వరి పంట ఎండిపోతుంది. పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
కొంతమంది రైతులు బోర్ల ద్వారా వరిపంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తే… మరికొంతమంది ఇంజన్లు ద్వారా వరినాట్లు తడిపి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తోటపల్లి ప్రోజెక్ట్ నీరు అందుబాటులో ఉండి పోలాలకు రాకపోవడం అధికారుల నిర్లక్ష్యం ఉందని ఆరోపిస్తున్నారు రైతులు. ఆధునీకరణ జరగకపోవడం, కొన్ని కాలువలలో అస్సలు పూడికలు తీయకపోవడంతో నీరు పొలాలకు అందటంలేదు.