సాధారణంగా ఏ భార్య అయిన తన భర్త మరో మహిళతో కాస్త చనువుగా ఉంటేనే తట్టుకోలేదు. అగ్గిమీద గుగ్గిలమైపోతుంది. మరోసారి సదరు మహిళతో చనువుగా ఉండొద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేస్తుంది. అవతల ఆ మహిళకు కూడా కోటింగ్ ఇచ్చేస్తుంది. కానీ, తిరుపతిలో మాత్రం ఓ మహిళ దగ్గరుండి మరి తన భర్తకు ప్రియురాలితో పెళ్లి చేయడం చర్చనీయాంశం అవుతోంది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఆ వివరాల్లోకి వెళ్తే..
తిరుపిలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ఓ యువకుడికి టిక్‌టాక్‌లో రాణిస్తున్న సమయంలో.. విశాఖకు చెందిన ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారితీయడంతో.. ఇద్దరూ కొన్నాళ్లు చనువుగా ఉన్నారు. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఆ అబ్బాయి ఆమె నుంచి దూరమయ్యాడు. అనంతరం అతనికి టిక్‌టాక్‌లోనే కడపకు చెందిన మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో.. పెద్దలను ఒప్పించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కట్ చేస్తే.. కొన్నాళ్ల తర్వాత ఆ అబ్బాయి మొదటి ప్రియురాలు, అదే విశాఖకు చెందిన అమ్మాయి మళ్లీ తిరిగొచ్చింది. కానీ.. అతనికి పెళ్లయిన విషయం తెలుసుకొని మొదట్లో బాధపడింది.
అయితే.. ఆ బాధ నుంచి కోలుకున్నాక ఆమె ఆ అబ్బాయి భార్యతో.. తానూ ఇక్కడే ఉండిపోతానని, ముగ్గురు కలిసి ఉందామని చెప్పింది. ఆ అమ్మాయి మాటలు విని ఖంగుతిన్న భార్య, తొలుత అయోమయానికి గురయ్యింది. ఆమె ప్రతిపాదనని ఏమాత్రం ఒప్పుకోలేదు. చివరికి మనసు మార్చుకొని.. ముగ్గురూ కలిసి ఉందామని ఒప్పుకున్నారు. ప్రియురాలితో తన భర్తకు పెళ్లి చేసేందుకు సిద్ధమవ్వడంతో.. వ్యవహారం పెళ్లి పీటలకు చేరింది. బుధవారం తానే దగ్గరుండి.. ప్రియురాలిని అలంకరించి మరీ భర్తకు పెళ్లి చేసింది. స్థానికంగా ఈ పెళ్లితంతు హాట్ టాపిక్‌గా మారింది.