టీటీడీ ఉద్యోగులకు ఎలక్ట్రికల్ వాహనాలపై రాయితీ

0
84

టీటీడీలో పనిచేసే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగుల ద్విచక్ర వాహనాల పార్కింగ్‌ కోసం రూ. 54 లక్షలతో నిర్మించిన పార్కింగ్‌ షెడ్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిరుమలలో పనిచేసే ఉద్యోగులకు ఎలక్ట్రికల్ బైక్‌లపై రాయితీ అందిస్తామని వెల్లడించారు.. ఇక, టీటీడీకి 100 ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు దాతలు అందించారని తెలిపిన ఆయన.. నవంబర్ 1వ తేదీ నుంచి సర్వదర్శనం, ఎస్.ఎస్.డి టోకెన్ జారీ చేస్తామన్నాఉ.. డిసెంబర్ 1వ తేదీ నుంచి బ్రేక్ దర్శనం టికెట్స్ సమయంలో మార్పులు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని వెల్లడించారు.. ముందుగా అనుకున్న విధంగా 10 గంటలు నుంచి 12గంటలు అనుకున్నాం, కల్యాణోత్సవం భక్తులు అదే సమయంలో ఉంటారు అనే సూచనతో కొద్ది మార్పులు చేశాం.. ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటల మధ్య బ్రేక్ దర్శనం ప్రయోగాత్మకంగా ప్రారంభించి పరిశీలిస్తామని తెలిపారు.

ఇక, టీటీడీ ఉద్యోగుల సంక్షేమం గురించి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.. గతంలో ఇచ్చిన హామీ మేరకు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు చేశామని గుర్తు చేశారు.. కాగా, అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగుల ద్విచక్ర వాహనాల పార్కింగ్‌ స్థలాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో పాటు.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మా రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యుడు పొకల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది.. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ వెల్లడించింది.. నిన్న స్వామివారిని 67,439 మంది భక్తులు దర్శించుకోగా.. అందులో 29,450 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.60 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here