శ్రీవారి నైవేద్యానికి ఇక సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు

0
97

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి నైవేద్యం కోసం ఇకపై సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అన్నప్రసాదంతో పాటు లడ్డు ప్రసాదానికి కూడా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించాలని నిర్ణయం. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు ధరల నిర్ణయానికి కమిటి ఏర్పాటు చేశారు. దాతలు అందించిన 10 లక్షల రూపాయల వ్యయంతో బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి వెండి కవచాలు ఏర్పాటు చేస్తాం. పద్మావతి మేడికల్ కాలేజిలో టిబి విభాగం ఏర్పాటుకు 53.62 కోట్లు కేటాయించాం. అలిపిరి వద్ద గోడౌన్ల నిర్మాణంకు 18 కోట్లు…కోల్డ్ స్టోరేజి నిర్మాణంకు 14 కోట్లు కేటాయించామన్నారు.

డిల్లిలోని ఆడిటోరియం అభివృద్ది పనులుకు 4 కోట్లు కేటాయించారు. టిటిడి విద్యా సంస్థలలో బోధన సిబ్బంది నియామకం అంగీకారం. డిల్లిలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో మే 3 నుంచి 13వ తేది వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహణ. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ది పనులుకు 3.12 కోట్లు కేటాయించారు. జూన్ 15 కల్లా శ్రీనివాస సేతు పనులు పూర్తి చేసి భక్తులుకు అందుబాటులోకి తీసుకుని వస్తాం అన్నారు. ఫారిన్ కరేన్సి మార్పిడి పై కేంద్రం విధించిన 3 కోట్ల జరుమానా రద్దు చేయ్యాలని హోంశాఖ దృష్టికి తీసుకువెళ్ళాలని నిర్ణయం తీసుకున్నామన్నారు వైవీ సుబ్బారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here