ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు శుభవార్త.. వయోపరిమితి సడలించిన సీఎం..

0
935

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న వారికి శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ గరిష్ట వయస్సును రెండేళ్ల పాటు సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది ప్రభుత్వం.. వాటిలో 411 ఎస్ఐ పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులు ఉండగా.. ఇప్పటికే ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.. ఎస్ఐ పోస్టుల్లో 315 సివిల్ (పురుషులు, మహిళల కేటగిరీలు), 96 ఏపీఎస్పీ (పురుషులు) పోస్టులు ఉన్నా యి. ఇక, 6,100 కానిస్టేబుల్ పోస్టుల్లో 3,580 సివిల్, 2,520 ఏపీఎస్పీ పోస్టులు ఉన్న విషయం విదితమే కాగా.. నోటిఫికేషన్‌ వచ్చినప్పట్టి నుంచి వయో పరిమితి పెంపుపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి.. దీంతో.. ప్రభుత్వానికి వస్తున్న విజ్ఞప్తులపై అధికారులతో చర్చించిన సీఎం వైఎస్‌ జగన్.. వారికి కూడా అవకాశం కల్పించేలా రెండేళ్లపాటు వయోపరిమితి పెంచుతూ చర్యలు తీసుకోవాల్సింది ఆదేశాలు ఇచ్చారు. దీంతో, మరింత మంది పోలీసుల కొలువుల కోసం పోటీ పడేందుకు అవకాశం లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here