రాజకీయాల్లో క్రమశిక్షణ అంకితభావం.. నీతి నిజాయితీ అవసరం

0
628

.ఉపరాష్ట్రపతిగా పదవీ కాలం పూర్తయిన తర్వాతనే నాకు స్వాతంత్రం వచ్చిందని భావించా.. ప్రస్తుతం ప్రోటోకాల్ లేకపోవడంతో అందరినీ స్వేచ్ఛగా కలిగే కలిసే అవకాశం వచ్చిందన్నారు. రాజకీయాల్లో క్రమశిక్షణ అంకితభావం.. నీతి నిజాయితీ.. ఎంతో అవసరం. ప్రస్తుతం నాయకుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. నిత్యం పడుకునే ముందు ఉదయం నుంచి రాత్రి వరకు ఏమి తప్పులు చేశామని మననం చేసుకోవాలన్నారు.

చట్టసభల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే బాధ కలుగుతుందన్నారు వెంకయ్యనాయుడు. ఏదైనా విషయం మీద చర్చించాలి. అభిప్రాయాలు చెప్పాలే తప్ప వ్యక్తిగత దూషణలు.. విమర్శలకు దిగకూడదు.. దేశమంతా పర్యటించి నా అభిప్రాయాలను వెల్లడిస్తా. అన్ని పార్టీల నాయకులతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయాల్లో శత్రువులు ఉండరు..ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. ఈ విషయాన్ని అన్ని పార్టీల నేతలు గుర్తుంచుకోవాలి. రాజకీయ నాయకుల ధోరణి మారితే ప్రజాస్వామ్యానికి ఎంతో మంచిది. నెల్లూరు నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది. సమయం ఉన్నప్పుడల్లా నెల్లూరుకు వచ్చి మిత్రులను, అభిమానులను కలుస్తూనే ఉంటానన్నారు వెంకయ్యనాయుడు.

గడపగడపకు ప్రభుత్వం మంచి కార్యక్రమం అని కితాబిచ్చారు వెంకయ్యనాయుడు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయో లేదో తెలుసుకోవడం ఎంత అవసరం. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకం కావడం చాలా మంచిది. ప్రభుత్వ పథకాలలో అవినీతి జరగకుండా రాజకీయ నాయకులు.. దళారుల జోక్యం లేకుండా ఉండేందుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ పథకాన్ని ప్రధాని మోడీ తీసుకువచ్చారన్నారు.

నెల్లూరులో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆత్మీయ అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడిని ఘనంగా సన్మానించారు ఓం బిర్లా. ఈ సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. నెల్లూరులోని చిన్న గ్రామంలో జన్మించి దేశానికి ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ఎదిగారు. రాజకీయ రంగంలో తనదైన ముద్రను వేసుకున్నారు. క్రమశిక్షణ అంకితభావంతో పదవులను నిర్వహించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా విశేష సేవలు అందించారు. వెంకయ్య నాయుడుతో కలిసి సన్నిహితంగా పనిచేసే అవకాశం నాకు కలిగింది. గురువు లాగా ఆయన రాజకీయ రంగంలో మాకు మార్గదర్శనం చేశారు.. స్వర్ణ భారతి ట్రస్టు ద్వారా సమాజానికి విశేష సేవలు అందిస్తున్నారని ప్రశంసలు కురిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here