లోన్ యాప్స్ రికవరీ ఏజెంట్ల వేధింపులతో అనేకమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఎన్టీవీతో విజయవాడ సీపీ క్రాంతిరాణా టాటా మాట్లాడారు. లోన్ యాప్స్ చాలా ప్రమాదకరం…ప్రజలు ఎవ్వరూ లోన్ యాప్స్ లో మనీ తీసుకోవదన్నారు.
లోన్ అప్లయ్ చేసే క్రమంలోనే పూర్తి వ్యక్తిగత సమాచారం ఇచ్చేస్తున్నారు. మన ఫోన్ కాంటాక్స్ట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. దీంతో వారు మన బంధువులకు కాల్ చేసి వేధిస్తున్నారు. సోషల్ మీడియాలో మన అకౌంట్ యాక్సెస్ ఎవరికీ ఇవ్వవద్దు. అందులో మహిళలు, చిన్నపిల్లల ఫోటోలు మార్ఫ్ చేసి అశ్లీలంగా తయారు చేసి పంపుతున్నారు. కాల్ సెంటర్స్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు.ఈ లోన్ యాప్ లకు ఆర్బీఐ, ప్రభుత్వం అనుమతులు లేవు. ఇలాంటి వాటికి పబ్లిక్ దూరంగా ఉండాలన్నారు. రికవరీ ఏజెంట్స్ పై కూడా దృష్టి పెట్టాం అనీ, నందిగామ కేసులో రికవరీ కంపెనీలను, ఏజెంట్లను అరెస్టు చేసాం అని వివరించారు సీపీ క్రాంతిరాణా టాటా.