అమరావతి పాదయాత్రపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత

0
150

అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులు ఎవరైనా జయమాలిని, జ్యోతిలక్ష్మీ పాటలకు రికార్డు డ్యాన్సులు వేస్తారా అని ఆయన నిలదీశారు. ఆడి కార్లు, బెంజ్ కార్లలో తిరిగే వాళ్లు రైతులా అని ఆరోపించారు. అమరావతి టు అరసవెల్లి రూట్ అంటే విజయవాడ, హనుమాన్ జంక్షన్, ఏలూరు మీదుగా వెళ్లాలని.. తెనాలి, వేమూరు, రేపల్లె, అవనిగడ్డ, గుడివాడ మీదుగా వెళ్లాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. పొర్లుదండాలు పెట్టుకుంటూ పాదయాత్ర చేసినా మూడు రాజధానులు రావడం ఖాయమన్నారు. ఇది రైతుల పాదయాత్ర కాదని.. రాజకీయ పార్టీల పాదయాత్ర అని ఆరోపించారు. వాకీటాకీలు, ఖరీదైన వాచీలు, బంగారు గాజులు పెట్టుకుని పాదయాత్ర చేసేవాళ్లను రైతులు అని పిలుస్తారా అని మండిపడ్డారు. తొడలు గొట్టే వాళ్లను రైతులు అని ఎలా పిలుస్తారని కారుమూరు వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here