విజయమ్మ కీలక నిర్ణయం.. వైసీపీకి బై.. వైఎస్సార్టీపీకి జై

0
178

వైఎస్సార్ టీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కీలక నిర్ణయం వెలువరించారు. గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో ఆమె తన నిర్ణయం ప్రకటించారు. తన కొడుకు, ఏపీ సీఎం జగన్ అధ్యక్షుడిగా వున్న వైసీపీకి ఆమె గౌరవ అధ్యక్షురాలు. ఇప్పుడు ఆపదవికి రాజీనామా చేశారు. రెండురోజుల పాటు ప్లీనరీ అంగరంగవైభవంగా జరగనుంది. తొలిరోజు ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సభ్యుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిగింది. ఉదయం 10 గంటల10 నిమిషాలకు పార్టీ జెండాను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆవిష్కరించారు. ఈ సమావేశాలకు వైసీపీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో విజయమ్మ వచ్చారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయమ్మ మాట్లాడుతూ.. వైసీపీ నుంచి నేను తప్పుకుంటున్నా అన్నారు. వైఎస్‌ జగన్‌ మాస్‌ లీడర్‌. యువతకు రోల్‌ మోడల్‌. మీ అందరి ప్రేమ సంపాదించిన జగన్‌ను చూసి గర్వపడుతున్నా. పేద బిడ్డల భవిష్యత్‌ను జగన్‌ చూసుకుంటారని వైఎస్‌ విజయమ్మ అన్నారు. రాజశేఖర్ రెడ్డి నుంచి ఇప్పటివరకూ ఆదరించారు. రాజకీయ జీవితంలో మీకు మాత్రమే నేను జవాబు చెప్పాలన్నారు విజయమ్మ.

రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో వున్నప్పుడు పులివెందుల, కడప ప్రజలు మాతో వున్నారు. ఆయన లేకపోయినా అదే ఆదరణ చూపించారు. నాలో ప్రాణం వున్నంతవరకూ కడప ప్రజలకు రుణపడి వుంటా. రాజశేఖర్ రెడ్డి మనిషి, మనిషిని ప్రేమించారు. తన మనసులో వున్న ఆలోచన అమలుచేశారు. ఆయన ఉన్నా లేకున్నా అవి కొనసాగుతున్నాయి. ఆయనంటే మీకు ఎంతో అభిమానం. రాజశేఖర్ రెడ్డి గారి మాట ఆదరణ, ఆయన చిరునవ్వు ధైర్యాన్ని ఇస్తుంది. ఏ ఒక్క రాజకీయనేతను 13 ఏళ్ల పాటు సజీవంగా వుంచుకున్నారు. రాజశేఖర్ రెడ్డిగారు 35 ఏళ్ళు పనిచేసిన పార్టీని వదిలేశారు. అప్పుడు ఆదరించింది, అక్కున చేర్చుకుంది మీరే అని చెబుతున్నా. జగన్ ఓదార్పుయాత్రకు వస్తే మీరే ఆయన్ని ఓదార్చారు. జగన్ కోసం వచ్చిన వారిని ఆదరించారు. మేం వున్నాం అని టీడీపీ ని ఓడించారు.షర్మిల పాదయాత్రకు పోయేటప్పుడు నాకు భయం వేసింది. ఒక బిడ్డ జైళ్ళో వుంటే.. మరో ఆడబిడ్డ రోడ్డుమీదకు వచ్చింది. ఆమె మూడువేల కిలోమీటర్లు నడిపించింది మీరే అని ఆమె వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here