ఆంధ్రప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కొందరిపై క్రమంగా పార్టీ మార్పు ప్రచారం సాగుతోంది.. ఈ వార్తలపై స్పందించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి.. నేను పార్టీ మారుతున్నానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఆ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు అని తెలిపారు.. నెల్లూరు జిల్లా కోవూరులో గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ విజయమ్మ తర్వాత వైసీపీలో ఎమ్మెల్యేను నేనే అన్నారు.. మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో నేను పార్టీ మారుతున్నాని కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. రాష్ట్రంలో నేను తిట్టినంతగా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుని ఎవరూ తిట్టలేదని గుర్తుచేసిన ఆయన.. నా తర్వాత ఆ స్థానాన్ని కొడాలి నాని తీసుకున్నారని తెలిపారు..
ఇక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొహం చూసే ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు.. మంత్రి పదవి రాలేదని చాలాచోట్ల కొంతమంది జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలు తగలబెట్టారు.. కానీ, నా నియోజకవర్గంలో అటువంటి ఘటనలు జరగనివ్వలేదని తెలిపారు.. అంతేకాదు.. నేను చనిపోయేంత వరకూ జగన్మోహన్ రెడ్డి తోనే ఉంటానని స్పష్టం చేశారు. నాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు అని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి. కాగా, ఈ మధ్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి విషయంలోనూ ఓ ప్రచారం జరిగింది.. ఆయన పవన్ కల్యాణ్ ట్వీట్‌పై స్పందించడంతో.. జనసేన పార్టీలో చేరతారనే గుసగుసలు వినిపించాయి.. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టిన బాలినేని.. తన ప్రయాణం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే.. తాను జగన్ వెంటేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.