మహీంద్రా థార్ పై సూపర్ డిస్కౌంట్.. ఎంతంటే..?

0
91

దేశీయ కార్ మేకర్ దిగ్గజం మహీంద్రా తన థార్ మోడల్ పై ఏప్రిల్ నెలలో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం దేశీయంగా ఎక్కువగా అమ్ముడవుతున్న SUVలలో మహీంద్రా థార్ ఒకటి. కంపెనీ థార్ 4X4 వెర్షన్‌పై ఆకర్షణీయమైన తగ్గింపును అందిస్తోంది. థార్(ఫోర్ వీల్ డ్రైవ్) పెట్రోల్, డిజిల్ వేరియంట్లపై దాదాపుగా రూ. 40,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం థార్ AX (O), LX వేరియంట్లలో లభిస్తోంది.

థార్ మూడు పవర్‌ట్రెయిన్లతో అందుబాటులో ఉంది. 1.5 డిజిల్ ఇంజిన్ లో 6స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో రేర్ వీల్ డ్రైవ్(RWD), 2.2 లీటర్ మాన్యువల్, ఆటోమోటివ్ గేర్ బాక్స్ తో 4 వీల్ డ్రైవ్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్లతో ఫోర్ వీల్, రేర్ వీల్ డ్రైవ్ తో థార్ అందుబాటులో ఉంది.

1.5 లీటర్ డిజిల్ ఇంజిన్లు 300 ఎన్ఎం టార్క్ తో 118 బీహెచ్పీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 2.2 లీటర్ డిజిల్ ఇంజిన్ 300 ఎన్ఎం టార్క్, 130 బీహెచ్పీ పవర్ జనరేట్ చేస్తుంది. ఇక పెట్రోల్ ఇంజిన్ 300 ఎన్ఎం టార్క్ తో 152 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మహీంద్రా థార్ 4X4 వెర్షన్ ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్‌తో వస్తుంది, ఇది తక్కువ ట్రాక్షన్ రోడ్‌లలో మెరుగైన గ్రిప్‌ని అందిస్తుంది.

మహీంద్రా థార్ త్వరలో కొత్త ఎంట్రీ లెవల్ 4X4 వేరియంట్‌ను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది AX (O) వేరియంట్ తో రాబోతోంది. 2.0 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ డిజిల్ ఇంజిన్లలో ఈ ఎంట్రీ లెవల్ థార్ రానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహీంద్రా 5 డోర్ల థార్ ను పరీక్షిస్తోంది. ఫోర్స్ గూర్ఖా, మారుతీ సుజుకీ జిమ్నీ వంటివి 5 డోర్ వెర్షన్ లో వస్తుండటంతో థార్ కు గట్టిపోటీ ఎదురవుతోంది. దీంతో త్వరలోనే తన 5 డోర్ థార్ ను విడుదల చేసేందుకు పరీక్షలు నిర్వహిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here