ఇండియాలో లాంచ్ అయిన మారుతి సుజుకీ బ్రేజ్జా 2022

0
268

కాంపాక్ట్ ఎస్ యూ వీ సెగ్మెంట్ లో మరింత పోటీ పెరగనుంది. కొత్తగా మారుతి సుజుకీ న్యూ బ్రేజ్జా 2022ను ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. గతంలో విటారా బ్రేజ్జాతో పోలిస్తే ఈ కొత్త బ్రేజ్జా మరింత స్టన్నింగ్ లుక్ లో కనిపించనుంది. స్పోర్టివ్ లుక్ తో, కొత్త ఇంటీరియర్ తో మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే మార్కెట్ లో కాంపాక్ట్ ఎస్ యూ వీ కింగ్ గా ఉన్న టాటా నెక్సాన్ తో పాటు, రెనో కిగర్, నిస్సాన్ మాగ్నైట్, కియా సోనెట్ కు కొత్త బ్రేజ్జా 2022 పోటీ ఇవ్వనుంది.

కొత్త  బ్రేజ్జా 2022 ప్రారంభం ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 13.96 లక్షలు( ఎక్స్ షోరూం)గా ఉంది. కొత్తగా క్రోమ్ గ్రిల్, ర్యాప్ రౌండ్ టెయిల్ లైట్లు, టెయిల్ గేట్, కొత్త బంపర్ తో న్యూ బ్రేజా వచ్చింది. డ్యుయల్ టోన్ క్యాబిన్ ఇంటీరియర్ మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. హెడ్ అప్ డిస్ ప్లే, మల్టీ ఫంక్షన్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ తో పాటు, స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ కార్ టెక్నాలజీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ప్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే కొత్త బ్రేజాలో ఉన్నాయి. మొత్తం తొమ్మిది రంగుల్లో ఈ కార్ అందుబాటులో ఉండనుంది.

1.5 లీటర్ కే సిరీస్ డ్యుయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ 102 బీ హెచ్ పీ పవర్ 135 న్యూటన్ మీటర్ టార్క్ జెనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ తో వస్తోంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 6 స్పీడవ్ టాక్క్ కన్వర్టర్ ప్యాడల్ షిఫ్టర్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here