Flipkart: మరోసారి ఫ్లిప్ కార్ట్ బిగ్ సేల్

0
102

Flipkart: ప్రముఖ ఇ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ అక్టోబర్ 5నుంచి 8వరకు బిగ్ దసరా సేల్ ప్రారంభించనుంది. ఈ కొత్త సేల్‌లో కస్టమర్లకు ప్రొడక్టులపై భారీ ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ లో స్మార్ట్ వాచ్‌లపై, ఇయర్ బడ్స్‌పై 70 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే పోకో ఫోన్లపై 45 శాతం తగ్గింపు అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట ప్లస్ మెంబర్లకు ఈ సేల్ 24 గంటల ముందు నుంచే ఉంటుంది.

దసరా, దీపావళి సమయంలోనే వినియోగదారులు తమకు కావాల్సిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. దీంతో డిమాండ్ కు తగ్గట్టు ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ పోటా పోటీగా పండుగల ప్రత్యేక విక్రయ కార్యక్రమాలను చేపడుతున్నాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ పూర్తయిన ఐదు రోజులకే ఫ్లిప్ కార్ట్.. బిగ్ దసరా సేల్ పేరుతో మరో విడత ఆఫర్లతో కూడిన విక్రయాలను నిర్వహిస్తోంది. హెచ్ డీఎఫ్ సీ కార్డులతో చెల్లింపులు చేస్తే 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తోంది. టీవీలపై కళ్లుచెదిరే డీల్స్ సొంతం చేసుకోవచ్చు. ఏకంగా 75 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. స్మార్ట్ టీవీల ధర రూ. 7,199 నుంచి ప్రారంభం అవుతోంది. ఇంకా వాషింగ్ మెషీన్ల ధర రూ. 6,990 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రిజ్‌లపై కూడా డీల్స్ సొంతం చేసుకోవచ్చు. ఏసీలపై, వాసింగ్ మెషీన్లపై 55 శాతం తగ్గింపు పొందొచ్చు.

Read Also: Meena: ఐశ్వర్య రాయ్ పై నటి మీనా ఆసక్తికర వ్యాఖ్యలు

ఐఫోన్ 13, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 11, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13 మినీ తదితర ఫోన్లను కనిష్ట ధరల్లో ఆఫర్ చేస్తోంది. హెచ్ డీఎఫ్ సీ కార్డులపై ఆఫర్ ను కూడా కలిపి చూస్తే.. ఐఫోన్ 13 రూ.57వేలకు, ఐఫోన్ 13 మినీ రూ.35,990కు, ఐఫోన్ 11 రూ.34,490కు లభిస్తోంది. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13 ప్రోపైనా డిస్కౌంట్ ఉంది. ఇంకా ల్యాప్ టాప్స్ కొనుగోలు చేసే వారిపై కూడా ఆఫర్లు ఉన్నాయి. 50 శాతం వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఇంకా క్రేజీ డీల్స్, రష్ అవర్స్, టైమ్ బాండ్ డీల్స్ వంటివి కూడా ఉంటాయి. వీటి ద్వారా అదనపు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. బై మోర్ సేవ్ మోర్ ఆఫర్ కూడా ఉంది. మూడు కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతంగా తగ్గింపు వస్తుంది. కొన్నింటిపై రెండు ప్రొడక్టులు కొన్నా 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అదే ఐదు ప్రొడక్టులు కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here