పోకో నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్ అదుర్స్

0
193

మార్కెట్ లోకి కొత్త కొత్త మొబైల్స్ రంగం ప్రవేశం చేయిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ పోకో కొత్త మోడల్ ‘ఎఫ్‌4 5జీ’ మొబైల్‌ను భారత మార్కెట్ లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. పోకో బ్రాండింగ్‌తో ఫ్లాట్ బాడీ రియర్‌ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఇది అందుబాటులోకి రానుంది. అంతేకాదు వ్లాగ్ మోడ్ కొత్త తరం ఫిల్మ్ మేకర్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేయనున్నట్లు పోకో ట్వీట్టర్‌ ద్వారా వెల్లడించింది. ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు రెడ్‌మి కే40ఎస్‌కి దగ్గరగా ఉంటాయని భావిస్తున్నారు. దీంతో పాటు 7లేయర్ గ్రాఫైట్ షీట్‌ల లిక్విడ్ కూల్ 2.0, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు , 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉంటాయట. బ్లాక్‌ అండ్‌ గ్రీన్‌ రంగులలో ఇది లభ్యం కానుంది.

ఆండ్రాయిడ్‌ 12 OS ఆధారిత ఎంఐయుఐ, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన అమెలెడ్‌ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC, 12 జీబీ ర్యామ్‌, 126 జీబీ స్టోరేజ్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 64 ఎంపీ మెయిన్‌గా, ట్రిపుల్‌ కెమెరాతో రానున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు పోకో ఎక్స్‌ 4జీటీ అనే మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్‌ చేయనున్నట్టు పోకో ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. పోకో ఎక్స్‌ 4 జీటీ ఫీచర్లు… 6.6అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, మీడియా టెక్‌ డైమెన్సిటీ 8100 SOC, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌తో 20 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 64ఎంపీ రియర్‌ కెమెరా, 5080 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అయితే భారత్‌లో త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అందుకోసం టెలికాం దిగ్గజ సంస్థలు కసరత్తులు చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here