తారాగణం:
కొత్త హీరోలకు వచ్చీరాగానే హిట్స్ రావడం బహు అరుదు. కానీ ఈ విషయంలో రాజ్ తరుణ్ అదృష్టవంతుడనే చెప్పాలి. ప్రారంభంలోనే వరుస విజయాలతో హ్యాట్రిక్ అందుకున్న ఈ యంగ్ హీరో.. కొన్నాళ్లుగా సరైన విజయాలు లేక సతమతమవుతున్నాడు. ఈ ఏడాది కూడా 'రంగుల రాట్నం, రాజుగాడు' సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఈ క్రమంలో రాబోయే 'లవర్' సినిమాపై ఆశలు పెంచుకున్నాడు రాజ్ తరుణ్.
దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో హర్షిత్ రెడ్డి నిర్మాతగా 'అలా ఎలా' ఫేం అనీశ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'లవర్'. పూణె మోడల్ రిద్ది కుమార్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జులై -20న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ప్రచారంలో జోరు పెంచిన 'లవర్' టీమ్.. తాజాగా టీజర్ వదిలారు.
దర్శకుడు అనీశ్ కృష్ణ గత చిత్రం 'అలా ఎలా' తరహాలోనే లవ్ స్టోరీకి కామెడీ టచ్ ఇచ్చారు. ఈ తరహా ప్రేమకథలు రాజ్ తరుణ్ కు ఇదేం కొత్తకాదు. ఆ మాటకొస్తే.. ఇప్పటివరకూ ఈ కుర్రహీరో చేసినవన్నీ ఇలాంటి సినిమాలే. మరి.. ఈ సినిమాతోనైనా రాజ్ తరుణ్ హిట్ అందుకుంటాడేమో చూద్దాం..!