ఆర్ఎక్స్100 సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్
తెచ్చుకున్న హీరో కార్తికేయ ఆ సినిమాతోనే యూత్ లో మంచి ఫాలోయింగ్
సంపాదించాడు. ఇప్పుడు ఆయన తదుపరి సినిమా గా హిప్పీ అనే సినిమాతో ప్రేక్షకుల
ముందుకు వస్తున్నాడు. దిగంగన సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరోయిన్లుగా సీనియర్
నటుడు జేడీ చక్రవర్తి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి
టీఎన్ క్రిష్ణ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్
అయిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత కళైపులి ఎస్.థాను నిర్మించారు. మరి ఈ
సినిమా ఏమేరకు ఆకట్టుకుందో ? రివ్యూలో చూద్దాం.
కధ :
హిప్పీ దేవదాస్
(కార్తికేయ)కి మార్షల్ ఆర్ట్స్ అంటే ప్రాణం, ఎలా అయినా మార్షల్ ఆర్ట్స్ లో
తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ట్రై చేస్తుంటాడు. అలా ఇంజనీరింగ్
పూర్తి కాగానే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ మొదలు పెడతాడు. ఈ క్రమం లో స్నేహ
(జజ్బా సింగ్)తో ప్రేమలో పడి ఆమెతో కలిసి లో లాంగ్ డ్రైవ్ కు వెళ్తారు.
ఆలా అక్కడ స్నేహ ఫ్రెండ్ ఆముక్తమాల్యద(దిగంగన సూర్యవంశీ)ను చూసి
ప్రేమిస్తాడు. ఆలా మెల్ల మెల్ల గా స్నేహ ను దూరం చేస్తూ ఆముక్తకు
దగ్గరవుతుంటాడు. దీంతో అతను తనకు స్నేహ వేరొకరిని పెళ్లి చేసుకొని
వెళ్ళిపోతుంది. తరువాత హిప్పీ, ఆముక్తమాల్యదలు దగ్గరవుతారు.కానీ
ఆముక్తమాల్యద తన ఆంక్షలతో హిప్పీకి నరకం చూపిస్తుంది. చెప్పినట్టు వినాలని,
చెప్పిన టైంకి రావాలని ఇబ్బంది పెడుతుంది. దీంతో ఎలాగైనా ఆముక్తమాల్యదను
వదిలించు కోవాలనుకుంటాడు హిప్పీ. అందుకోసం హిప్పీ ఏం చేశాడు..? చివరకు
హిప్పీ, ఆముక్తమాల్యదలు కలిసున్నారా.. విడిపోయారా? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ :
తెలుగు
ప్రేక్షకులు చూసినన ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో ఇదేమీ కొత్త తరహా చిత్రమైతే
కాదు. ఎప్పటి నుండో చూస్తున్న రొటీన్ ఫార్ములా స్టోరీ. అయితే ట్రెండ్‌కు
తగినట్లు మార్చి తెరకెక్కించారు. తొలి పది నిమిషాల్లోనే జేడీ చక్రవర్తి
చెప్పే డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ఈ సినిమా ఎవరిని టార్గెట్ చేస్తూ
తీశారు అనే దాని మీద క్లారిటీ ఇచ్చేశారు. ఇక కథ పరంగా బాగానే ఉన్న ఈ
సినిమా కథనం మాత్రం సాగతీత ధోరణితో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.
ఇక వెన్నెల కిషోర్ కామెడీ ఎపిసోడ్ బాగానే వర్క్ అవుట్ కావటం కాస్త రిలీఫ్
ఇస్తుంది. ఆర్ఎక్స్ 100లో సీరియస్ ఎక్స్ప్రెషన్లో కనిపించిన
కార్తికేయకు ఈ సినిమాలో వేరియేషన్స్ చూపించే అవకాశం దక్కింది. నటనపరంగానూ
మంచి మార్కులు సాధించాడు. హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ ఆముక్తమాల్యద
పాత్రలో ఒదిగిపోయింది. నటనతో పాటు గ్లామర్ షోతోను యూత్ ఆడియన్స్‌ను
కట్టిపడేసింది. కీలక పాత్రలో నటించిన జేడీ చక్రవర్తి జీవించాడు. వెన్నెల
కిశోర్ తన కామెడీ టైమింగ్‌తో బాగానే నవ్వించాడు. ఇతర పాత్రల్లో జజ్బా
సింగ్, బ్రహ్మాజీ, సుదర్శన్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక ఆర్డీ
రాజశేఖర్ సినిమాటోగ్రఫి బాగుంది. నివాస్ కే ప్రసన్న సంగీతం పరవాలేదు.
ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకాస్త ద్రుష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు
సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్లీ : నేటితరం యూత్ కి బాగా కనెక్ట్ అవుతాడు ఈ హిప్పీ