తారాగణం:
స్టార్ కాస్ట్ : అల్లు అర్జున్ , పూజా హగ్దే , సుశాంత్, నివేదా పేతురాజ్, టబు,సముద్ర ఖని
దర్శకత్వం : త్రివిక్రమ్
నిర్మాతలు: అల్లు అరవింద్ , చినబాబు
మ్యూజిక్ : థమన్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు భారీ అంచనాలతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా విడుదల అయింది. మరి బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కొట్టారా.. అలాగే ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో , అభిమానుల అంచనాలను సినిమా ఏ మేరకు అందుకుంది..? అసలు సినిమా కథ ఏంటి అనేది..ఇప్పుడు చూద్దాం.
కథ :
బంటు (అల్లు అర్జున్) అంటే తన తండ్రి వాల్మీకి (మురళీ శర్మ)కి ఏమాత్రం ఇష్టం ఉండదు. తనకు కావాల్సింది ఇవ్వకపోవడం, సరిగ్గా చూడకపోవడం చేస్తూ ఉంటాడు. దాంతో చిన్నప్పటినుండి తండ్రి అంటే ఇష్టం లేకుండానే పెరుగుతాడు. అమూల్య(పూజా హెగ్డే) ఓ టూరిజం కంపెనీ నడుపుతుంటుంది. ఆమె అసిస్టెంట్‌గా బంటు జాయిన్ అవుతాడు. బంటు..అమూల్య ను ప్రేమించడం మొదలు పెడతాడు.ఇదిలా జరుగుతుండగా రామ చంద్ర (జయరాం) తన కొడుకు రాజ్ ( సుశాంత్ ) కు అమూల్య ను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. రామ చంద్ర బిజినెస్ పై కన్నేసిన విలన్ (సముద్రఖని) అతనిపై దాడి చేయిస్తాడు. ఈలోపు బన్నీకి అసలు విషయం తెలిసి అల వైకుంఠపురములోకి ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? అసలు బంటు కు తెలిసిన నిజం ఏంటి..? బంటు కు వైకుంఠపురము కు లింక్ ఏంటి..? బంటు - అమూల్య ప్రేమ ఏమవుతుంది..? అసలు మురళి శర్మ కు బంటు అంటే ఎందుకు ఇష్టం ఉండదు..? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
అల్లు అర్జున్ యాక్టింగ్ , డాన్స్ , యాక్షన్ గురించి చెప్పాల్సిన పనేలేదు..ఈ సినిమా లో కూడా బన్నీ నుండి ఎంత రాబట్టలో అంత రాబట్టాడు త్రివిక్రమ్. ఎమోషన్ తో కూడా బన్నీ కట్టిపడేసాడు. ఇక సాంగ్స్ లో బన్నీ మరోసారి తన డాన్సులతో కట్టిపడేసాడు. ఇక యాక్షన్ ఓ రేంజ్ లో చూపించాడు. పూజా హగ్దే గ్లామర్ తో పాటు తన నటనతోను ఆకట్టుకుంది. సీనియర్ నటి టబు చాల రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. ఆనంద్ గా జయరాం తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తమిళ్ నటుడు సముద్రఖని విలన్ రోల్ లో అదరగొట్టారు. రాజ్ పాత్ర లో సుశాంత్ బాగానే నటించాడు. సుశాంత్ - నివేత మధ్య వచ్చే సన్నివేశాలు యూత్ కు బాగా నచ్చుతాయి. వాల్మీకి పాత్రలో అల్లు అర్జున్ తండ్రిగా మురళి శర్మ అద్భుతంగా నటించారు. రాహుల్ రామకృష్ణ , వెన్నెల కిషోర్ , చమ్మక్ చంద్ర కామెడీ ఆకట్టుకుంది.నవదీప్ , సునీల్ , బ్రహ్మాజీ , అజయ్ , తనికెళ్ళ భరణి , వారి వారి పరిధిలో నటించి మెప్పించారు.
సాంకేతిక విభాగం :
మ్యూజిక్ థమన్ సినిమాకు ప్రాణం పోసాడని చెప్పాలి..సినిమాకు సంక్రాంతి బరిలో ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం మ్యూజిక్ అనే చెప్పాలి. కేవలం పాటలు మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టాడు. సినిమా ఫొటోగ్రఫీ చెప్పే పనేలేదు. ప్రతి ఒక్క ఫ్రేమ్ ఎంతో కలర్ ఫుల్ గా చూపించి ఆకట్టుకున్నారు . ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో స్పీడ్ గా సాగింది..కాకపోతే సెకండ్ హాఫ్ లో ఓ పది నిముషాలు స్లో గా అనిపిస్తుంది. ఇక గీత ఆర్ట్స్ - హారిక నిర్మాణ విలువలు బాగున్నాయి .
డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి చెప్పాలంటే..గత రెండు సినిమాలు త్రివిక్రమ్ సత్తాను పూర్తిగా చూపించలేకపోయినప్పటికీ..ఈ వైకుంఠపురం లో మాత్రం త్రివిక్రమ్ మార్క్ కనపడింది. కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ ఇలా ప్రతిదీ ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రతి ఒక్క నటుడిని చాల బాగా వాడుకున్నాడు. కాకపోతే సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం కాస్త తడబడ్డాడు. వావ్ అనిపించే సన్నివేశాలు పెద్దగా లేకపోవటం, ఒక్క హై మూమెంట్ కూడా లేకపోవటం అభిమానులను నిరాశ కలిగిస్తుంది. అలాగే ఓ పదినిమిషాలు స్లో గా ఉండడం కూడా ఇబ్బంది పెట్టింది. మిగతా అంత కూడా బాగా నడిపించాడు. ఓవరాల్ గా అభిమానులకు ఈ సినిమా పండగే.
ప్లస్ : కథ, అల్లు అర్జున్, మ్యూజిక్
మైనస్ : సెకండ్ హాఫ్, ఎడిటింగ్