రెస్టారెంట్‌లో పెట్టుబడి పేరుతో 13 కోట్ల మోసం.. తల్లీకొడుకులు అరెస్ట్

0
131

రెస్టారెంట్‌లో పెట్టుబడి పేరుతో పలువురికి టోకరా వేసిన నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌లో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్‌లో పెట్టుబడి పేరుతో నమ్మించి దాదాపు రూ.13 కోట్లను నిందితులు కొట్టేశారు. క్యూబా డ్రైవ్ ఇన్ ఫుడ్ కోర్టులో పెట్టుబడి పెడితే భారీగా వాటా ఇస్తానని పలువురిని నమ్మించి ఘరానా మోసగాళ్లు 13 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అసలు విషయం తెలిసిన బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

ప్రధాన నిందితులైన నాగిల్లా జసింత్, నాగిల్ల సుకన్య తల్లి కొడుకులని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరో నిందితుడైన జసింత్ తండ్రి నాగిల్ల రూఫస్ పరారీలో ఉన్నాడని తెలిపారు. రూఫస్ కోసం గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. నిందితులపై ఇంతకుముందే పలు స్టేషన్లలో కేసులు ఉన్నాయని చెప్పారు. నిందితుడు నాగిల్ల రూఫస్ చర్చి పాస్టర్‌గా వ్యవహరిస్తూ చర్చికి వచ్చిన వారి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి బాధితులను మోసం చేశారని పోలీసులు వివరించారు. ఇలా వివరాలు తెలియకుండా పెట్టుబడులు పెట్టవద్దని పోలీసులు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here