సినీ పరిశ్రమలో అసిస్టెంట్ దర్శకుడి ‘వ్యభిచారం’.. సినిమా ఆఫర్ల ఆశ చూపించి..

0
500

కళ్ల ముందు కనిపించేదంతా నిజం కాదు అన్నట్టు.. రంగులమయంగా కనిపించే సినీ పరిశ్రమలో కూడా కంటికి కనిపించని ఎన్నో చీకటి రహస్యాలు ఉంటాయి. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిపోవాలని వచ్చే అమ్మాయిల్లో కొందరు నరకం అనుభవిస్తున్నారు. అవకాశాల ఎర చూపించి, కొందరు దుండగులు అమ్మాయిల్ని వ్యభిచారం రొంపిలోకి దింపుతున్నారు. ఇలాంటి పాడు పనే చేస్తూ.. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తాజాగా పట్టుబడ్డాడు. సినిమా అవకాశాల పేరుతో ఉత్తరాది నుంచి అమ్మాయిల్ని పిలిపించి.. వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. చివరికి అతగాడు అడ్డంగా బుక్కయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఆ అసిస్టెంట్ దర్శకుడి పేరు సురేష్ బోయిన. ఓ ప్రముఖ దర్శకుడి వద్ద అతడు పని చేస్తున్నాడు. 2017 నుంచి ఆ దర్శకుడి వద్ద పని చేస్తున్న సురేష్.. సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు. ముంబై, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ అమ్మాయిలను ఇక్కడికి పిలిపించి.. వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. అమ్మాయిల ఫోటోలను ఆన్‌లైన్‌లో పెట్టి.. అతడు ఈ పాడు పని చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని కొందరు ప్రముఖులకు సైతం ఇతడు యువతుల్ని సరఫరా చేశాడు. పెద్దవారి కోరికలు తీరిస్తే.. భారీ అవకాశాలు వస్తాయని, దాంతో కెరీర్ మలుపు తిరుగుతుందని మాయమాటలు చెప్తూ వచ్చాడు. గోవా, బెంగళూరులో కూడా వ్యభిచారం దందాను నడిపించాడు.

సురేష్ బోయిన చేస్తున్న ఈ చీకటి వ్యాపారం గురించి తెలుసుకుని.. పోలీసులు అతడ్ని అడ్డంగా పట్టుకున్నారు. ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి, సాక్ష్యాలతో పాటు రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఇతనితో పాటు మేకల అఖిల్ కుమార్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిసింది. వీరి చెర నుంచి ఆ యువతుల్ని తప్పించారు. దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? పెద్దతలకాయల హస్తం ఏమైనా ఉందా? అనే కోణాల్లోనూ పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here