మియాపూర్ లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పులు కలకలం రేపాయి.. వివరాలలోకి వెళ్తే మియాపూర్ పరిధిలోని మదీనగూడ లోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్ లో దేవేందర్ గయాన్ అనే వ్యక్తి మేనేజర్ గా పనిచేస్తూన్నారు.. ఎప్పటిలానే అతను తన విధులు ముగించుకొని రాత్రి 9 గంటల 40 నిమిషాల సమయంలో బయటకి వచ్చారు..
తాను అలా బయటకి రావడంతోనే గుర్తు తెలియని వ్యక్తి మేనేజర్ పైన 5 రౌండ్ లు కాల్పులు జరిపి పరారయ్యారు.. గాయపడిన దేవేందర్ ని హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.. సమాచారం అందుకున్న సైదారాబాద్ పోలీసుసులు ఘటన స్థలాన్ని చేరుకొని సీసీ కెమెరా ని పరిశీలించగా అందులో గుర్తు తెలియని వ్యక్తి హెలిమెటె పెట్టుకొని బైక్ పైన వచ్చి మేనేజర్ పైన కాల్పులు జరిపినట్లు ఉండగా వీలైనంత త్వరగా ఆ హంతకుడిని పట్టుకుంటాం అని చెప్పారు.. చేపినట్లే ఆ హంతకుడిని పట్టుకున్నారు పోలీసులు..
హత్యకి కారణం పాత కక్షలే అని తెలుస్తుంది.. అదే రెస్టారెంట్ లో మరో మేనేజర్ గా చేసిన రితీష్ నాయర్ కి దేవేందర్ కి మధ్య అమ్మాయి కోసం గొడవ జరిగింది.. ఈ గొడవలో రితీష్ దేవేందర్ పైన చెయ్యి చేసుకోవడం తో దేవేందర్ ఓనర్ కి ఫిర్యాదు చేశారు దీనితో రితిక్ ఉద్యోగం పోయింది.. దీనితో కక్షగట్టిన రితీష్ రిక్కీ నిర్వహించి మరి దేవేందర్ ని హత్య చేసినట్లు అంగీకరించారని
పోలీసులు తెలిపారు..