ఆకలి భాధ తెలియని జీవితాలు కొందరివి అయితే రెక్కాడితేగాని డొక్కాడని బ్రతుకులు ఎందరివో.. కూటికోసం కోటి విద్యలని మనిషి అతన ఆర్ధిక ఇబ్బందులని అధిగమనించడానికి శాయశక్తులా కృషి చేస్తుంటాడు.. అయితే తాజాగా కడుపునింపాల్సిన కొలువు అతని పాలిట మృత్యు మృదంగం వాయించింది.. వివరాలలోకి వెళ్తే వీరవీందర్ హోమ్ గార్డ్ గా పనిచేస్తున్నాడు..
కాగా అతనికి రెండు నెలలుగా వేతనం ఇవ్వలేదు.. ఈ తరుణంలో తనపై అధికారులని అడగగా.. వాళ్ళు సీఎం కెసిఆర్ కి ఫోన్ చేసి అడుగు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మనస్తాపానికి గురైయ్యాడు రవీందర్.. ఒక వైపు వేతనాలు లేవు..మరోవైపు బ్యాంకు ఇఎంఐ లు కట్టాలి.. అప్పుల వాళ్ళ వేధింపులతో ఒత్తిడికి గురైన రవీందర్ సెప్టెంబర్ 5 వ తేదీన ఆత్మహత్యకి పాలపడ్డాడు..
కాగా కుటుంబసభ్యులు హాస్పిటల్ లో జాయిన్ చేశారు.. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ రవీందర్ నిన్న మృతి చెందారు.. రవీందర్ మృతితో ఆసుపత్రి ముందు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.. ఇప్పటికే హోమ్ గార్డ్లు విధులు బహిష్కరించి హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు..
రవీందర్ భార్య మరియు కుటుంబసభ్యులతో కలిసి పెద్ద ఎంతున ఆందోళన చేపట్టారు.. దీనితో దిగివచ్చిన పోలీస్ అధికారులు రవీందర్ భార్య సంధ్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.. కాగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగ వద్దు వేరే ఏదైనా డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇవ్వమని అడిగాను అని రవీందర్ భార్య సంధ్య మీడియాకి తెలిపింది.. కాగా ఈ రోజు ఆమెకు ఏ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తారో తెలుస్తుంది..