అనంతలో దారుణం.. మహిళా లెక్చరర్ గొంతుకోసిన భర్త

0
80

Anantapuram: అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాలేజీలోనే ఓ మహిళా లెక్చరర్ పై కట్టుకున్న భర్తే కత్తితో దాడికి చేశాడు. అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో గురువారం ఈ హత్నాయత్నం జరిగిందింది. కత్తితో గొంతుకోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో విద్యార్థులు, లెక్చరర్లు గట్టిగా కేకలు వేయడంతో సదరు వ్యక్తి పారిపోయేందుకు పరుగుతీశాడు. విద్యార్థులు సిబ్బంది సాయంతో పోలీసులు దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో సుమంగళి కామర్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. ఎప్పట్లాగానే కాలేజీకి వచ్చిన ఆమెపై భర్త పరేష్ విరుచుకుపడ్డాడు. కాలేజీలోని కామర్స్ డిపార్ట్ మెంట్ భవనం వెలుపల కత్తితో దాడి చేయడంతో, సుమంగళి ప్రతిఘటించి గట్టిగా కేకలు వేసింది. దాంతో విద్యార్థులు, ఇతర లెక్చరర్లు పరుగున వచ్చి పరేష్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అప్పటికే అతడు గొంతుకోయడంతో తీవ్రంగా గాయపడిన మహిళా లెక్చరర్ ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగానే మహిళా లెక్చరర్ పై ఆమె కోర్టులో విడాకుల కేసు వేశారు. ఈ కేసు కోర్టులో ఉంటుండగానే భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీనిపై పోలీసులు స్పందిస్తూ, ఏడాదికాలంగా సుమంగళి, పరేష్ వేర్వేరుగా ఉంటున్నారని వెల్లడించారు. ఆమె తన భర్తపై గృహ హింస కేసు పెట్టిందని, విడాకులు కోరుతోందని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here