కోడిపందాల్లో టీడీపీ నేత చింతమనేని.. పోలీసులను చూసి పరార్‌..

0
125

హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మాజీ టీడీపీ ఎమ్మేల్యే, ఏపీకి చెందిన చింతమనేని ప్రభాకర్ సహా పలువురు వీఐపీలు దీనికి వెనక ప్రధాన సూత్రధారులని పోలీసులు భావిస్తున్నారు. పెదకంజర్ల గ్రామంలో ఓతోటలో లక్షల్లో బెట్టింగ్ పెట్టి కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో.. దాడులు చేశారు. దీంతో.. 20మందికి పైగా బెట్టింగ్ రాయుళ్లు పట్టుబడ్డారు.

అయితే పలువురు పరారీకావడంతో పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులను చూసి టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ పరారైనట్లు పోలీసులు తెలిపారు. పటాన్ చెరు డీఎస్పీ భీం రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. గత కోంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా కోడిపందాలు నిర్వహిస్తున్నట్లుగా భావిస్తున్నారు పోలీసులు. రూ. 13,12,140 – 00 నగదుతో పాటు 21మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 26 వాహనాలు, 32 పందెం కోళ్లును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here