Jabardast Comedian Arrested: ప్రేమ వంచన.. కటకటాల్లో కమిడియన్ సందీప్

0
38

ప్రేమ వంచన.. కటకటాల్లో కమిడియన్ సందీప్
జబర్దస్త్ కిర్రాక్ కామెడీ షో అంటూ ఈ టీవీ లో ప్రసారమయ్యే ఈ షో ఎంతోమంది కళాకారులకి జీవితాన్ని అంహించింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. ఈ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యి వెండి తెర మీద మెరుస్తున్న తారలు ఎందరో.. ఈ షో ద్వారా హీరో గ మారిన వారుకూడా ఉన్నారు..

ఈ షో కంటెస్టెంట్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.. ఈ షో ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించే వారు కొందరైతే వచ్చిన పేరుని అడ్డం పెట్టుకుని అనాలోచిత పనులు చేసి జీవితాలని నాశనం చేసుకునే వాళ్ళు మరికొందరు..ఆ వరుసలోకి వస్తాడు జబర్దస్త్ కంటెస్టెంట్ నవ సందీప్.. ఈ షో కంటెస్టెంట్ నవ సందీప్ ని పోలీసులు అరెస్ట్ చేసారు అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది..

జబర్దస్త్ సందీప్ ప్రేమ పేరుతో వంచించారని, లైగికంగా వాడుకుని మోసం చేశారని ఓ యువతీ పోలీసులని ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు నిన్న రాత్రి సందీప్ ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.. ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంది.. తేరా మీద నటిస్తూ నవ్వించే కమెడియన్.. తెర వెనక నటిస్తే ప్రర్యవసానం ఇలానే ఉంటుందని ప్రజలు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.. అయితే నాలుగు రోజుల ముందు యువతి ఫిర్యాదు మేర కేస్ నమోదు చెయ్యగా.. నిన్న రాత్రి అరెస్ట్ చేసారూ అనే వార్త వెలుగు చూసింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here