రిఫ్రిజిరేటర్‌లో విగతజీవిగా 50 ఏళ్ల వ్యక్తి.. అసలేం జరిగింది?

0
135

దేశరాజధానిలో ఓ ఇంట్లో ఫ్రిజ్​లో మృతదేహం బయటపడటం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీలో 50 ఏళ్ల వ్యక్తి మృతదేహం రిఫ్రిజిరేటర్‌లో లభించింది. ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు విషయం తెలియగానే ఘటనాస్థలికి చేరుకుని ఫ్రిజ్‌లోని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతి చెందిన వ్యక్తిని జాకీర్‌గా గుర్తించారు.

శుక్రవారం సాయంత్రం 7.15 గంటల ప్రాంతంలో తమకు ఓ కాల్ వచ్చిందని, తన బంధువు ఒకరు ఫోన్‌ కాల్స్‌కు హాజరుకావడం లేదంటూ సమాచారం ఇచ్చారు. పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత ఆమె జాకీర్ ఇంటికి చేరుకున్నారు. ఆయన రూమ్‌కు వెళ్లగానే అంతా నిశ్శబ్దంగా ఉండటాన్ని గమనించింది. అనుకోకుండా ఫ్రిడ్జ్ డోర్ తీయగానే ఆమె కళ్లు బైర్లుకమ్మే తెలిసింది. రిఫ్రిజిరేటర్‌లో జాకీర్ మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రిఫ్రిజిరేటర్‌లో మృతదేహం ఉన్నట్టు గుర్తించారని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

మరణించిన జాకీర్ అనే వ్యక్తి ఒంటరిగా జీవిస్తున్నట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వివరించారు. భార్యాపిల్లలకు ఆయన దూరంగా జీవిస్తున్నట్లు తెలిసిందని తెలిపారు. అయితే, ఈ మర్డర్ కేసులో ఓ క్లూ తమకు దొరికిందని, త్వరలోనే ఈ కేసును పరిష్కరిస్తామని పోలీసులు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here