బాసటగా నిలవాల్సినవాడే బంగారు తల్లి జీవితాన్ని నాశనం చేశాడు. మానవ మృగాల నుంచి రక్షించాల్సినవాడే రాక్షసుడిగా మారాడు.. కన్న బిడ్డను కాపాడాల్సిన వాడే కాలసర్పంగా మారాడు.. వావివరుసలు మరిచి కన్న కూతురినే కాటేశాడు. అభం శుభం తెలియని పదేళ్ల చిన్నారిపై.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తండ్రీకూతుళ్ల బంధానికి మచ్చతెచ్చే ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. తండ్రి తన కన్నకూతురిపై పశువులా మీదపడి కోరిక తీర్చుకోవడమే కాకుండా ఆ చిన్నారిని హత్య చేసిన అవమానకర ఘటన థానేలోని భివాండి ప్రాంతంలో జరిగింది.
నిర్మాణంలో ఉన్న గోదాము గోడ కూలి 5గురు మృతి
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. భివాండి ప్రాంతంవో 34 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి తన పదేళ్ల కుమార్తెపై అత్యాచారానికి పోల్పడ్డాడు. అనంతరం గొంతు కోసి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై ఐపీసీ, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని జులై 22 వరకు పోలీసు కస్టడీకి తీసుకున్నారు.