మణిపూర్‌లో మతకలహాలు చల్లారడం లేదు .. విచక్షణా రహితంగ ప్రవర్తిస్తూ ఒకరిని ఒకరు చంపుకునే స్థాయికి దిగజారారు అక్కడి ప్రజలు.. శుక్రవారం (ఆగస్టు 18) తెల్లవారుజామున 4.30 గంటలకు కుకి ప్రజలు నివసించే తోవాయి కుకి గ్రామ శివారులోని గుట్టల చాటు నుంచి కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో మణిపూర్‌లో మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో కుకీ తెగకు చెందిన ముగ్గురు మృతి చెందినట్లు ఉఖ్రుల్ జిల్లా పోలీసు అధికారి ఎన్. వాషుమ్ అన్నారు.
తోవాయి గ్రామంలో ముగ్గురు మృతి చెందిన ఘటనపై.. గిరిజనులు నిరసన చేపట్టారు. కుకీ-జో కమ్యూనిటీ ఆధిపత్యం ఉన్న కాంగ్‌పోక్పి జిల్లాలో నిరసన ప్రదర్శనలుచే పట్టి.. అందులో భాగంగా వందలాది మంది మహిళలు నిన్న మధ్యాహ్నం నుంచి జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా అక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి. కొండ ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్‌ను మోహరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు కేంద్రం జోక్యం చేసుకుని కుకీ తెగకు చెందిన ముగ్గురు మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని మహిళా నిరసనకారులు తెలిపారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA)ని వీలైనంత త్వరగా తిరిగి అమలు చేయాలని కోరారు.
మణిపూర్‌లోని అన్ని లోయ జిల్లాల్లో కొండ జిల్లాల తరహాలో AFSPAని మళ్లీ అమలు చేయాలని ఆదివాసీ ఏక్తా కమిటీ (COTU) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు మణిపూర్ ముఖ్యమంత్రి మునుపటి ఘటనలు మరచిపోండి, శాంతియుతంగా జీవించండి అని పిలుపునిచ్చి రెండు రోజుల కూడా పూర్తి కాకముందే నిరసనకారులు ముగ్గురు వ్యక్తులను చంపి.. మళ్లీ హింసకు దారితీసేందుకు కారణం అయ్యారు .