‘ఓటీపీ’ వివాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు

0
256

ఓటీపీ విషయంలో చెలరేగిన వివాదంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. చెన్నైలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. తన కారు డోరును తన్నాడన్న కోపోద్రేకంతో ఓలా డ్రైవర్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై పిడిగుద్దులు కురిపించి దారుణంగా హత్య చేశాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన ఉమేందర్ కోయంబత్తూర్‌లోని ఓ ఐటీ కంపెనీలోఉద్యోగం చేస్తున్నాడు. ఉమేందర్ వీకెండ్‌లో కుటుంబంతో కలిసి చెన్నైలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. భార్యాపిల్లలతో కలిసి ఆదివారం ఓ మాల్‌లో సినిమా చూశాడు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఉమేందర్ భార్య ఓలా క్యాబ్ బుక్ చేసింది.

క్యాబ్ రాగానే అందరూ ఎక్కి కారులో కూర్చున్నారు అయితే సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీపై గందరగోళం నెలకొనగా… ఓటీపీ సరిగా చెప్పలేదంటూ కారు డ్రైవర్ ఎన్.రవి అందరినీ కిందికి దిగాలని సూచించాడు. అప్పటికే ఉమేందర్ కుటుంబం క్యాబ్‌లో కూర్చోగా.. కిందకు దిగాలని డ్రైవర్‌ గద్దించాడు. సరైన ఓటీపీ చెప్పిన తర్వాతే క్యాబ్‌ ఎక్కాలని స్పష్టం చేశాడు. అయితే దిగే క్రమంలో క్యాబ్‌ డోర్‌ను ఉమేందర్ తన్నడంతో కోపోద్రిక్తుడైన డ్రైవర్‌.. అతడిపై దాడికి పాల్పడ్డాడు. ఉమేందర్‌పై పిడిగుద్దులు కురిపించాడు. దెబ్బలు తాళలేక అతడు కుప్పకూలిపోయాడు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు డ్రైవర్‌పై హత్యనేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here