ఇంట్లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి, పలువురి పరిస్థితి విషమం

0
112

బిహార్‌లోని సరన్ జిల్లా ఛప్రాలో భారీ పేలుడు చోటుచేసుకుంది. చఫ్రాలో ఓ ఇంట్లో ఆదివారం జరిగిన పేలుడు కారణంగా ఇల్లు కూలి ఆరుగురు మరణించారని జిల్లా ఎస్పీ సంతోష్‌ కుమార్ తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు. పేలుడు గల కారణాల గురించి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఫోరెన్సిక్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన చెప్పారు. గాయపడిన వారిని ఛప్రాలోని సదర్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆరు అంబులెన్సులు, సహాయక బృందాలు మోహరించారు.

ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖోదైబాగ్ ప్రాంతంలో రియాజ్ మియాన్ అనే వ్యక్తి ఇంట్లో ఇవాళ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి అక్కడి ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. ఇల్లు నామరూపాలు లేకుండా మారిపోయింది. పైకప్పులు ఎగిరిపోయాయి. గోడలు కూలిపోయాయి. శిథిలాలు కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. రియాజ్ మియాన్ ఒక బాణసంచా వ్యాపారి, అతను వివాహాల సమయంలో అక్రమంగా పటాకులు అమ్మేవాడు. ఆ ఇల్లు అక్రమ పటాకుల తయారీ యూనిట్ పోలీసులు వెల్లడించారు. పేలుడు తీవ్రతకు ఇల్లు ధ్వంసం కావడమే కాకుండా పక్కనే ఉన్న ఆరు ఇళ్లు దెబ్బతిన్నాయి. పక్కనే ఉన్న ఆరుకు పైగా ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇంత భారీ పేలుడు ఎలా జరిగిందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here