భర్త తన వద్దకంటే రెండో భార్య వద్దే ఎక్కువ సేపు సమయం గడుపుతున్నాడని భావించి విసుగు చెందిన ఒక మహిళ ఏకంగా అతనికి పెద్ద శిక్షే విధించింది. ఏకంగా అతని మర్మాంగానే కోసేసింది. ఈ దారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మిమ్లానాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తన భర్త తన వద్ద కంటే తన సవతి దగ్గరే ఎక్కువ సమయం గడుపుతున్నాడని భావించిన ఒక మహిళ తన భర్త జననాంగాన్ని కోసేసింది.