pushpa 2 : పుష్ప 2 లో ఐటమ్ పాట.. తగ్గేదేలే అంటున్న సుకుమార్

0
36

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప.. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించిన తీరు అభిమానులతో పాటు వీక్షకుల అందరి మసును ఆకట్టుకుంది.. ఒక్కమాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఎన్నడు కనిపించని విధంగా కనిపించారు.. స్మగ్లర్ గా వైవిధ్యమైన పాత్రలో నట్టించారు.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటన కి గాను నిన్న నిర్వహించిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ లో బెస్ట్ ఆక్టర్ గా జాతీయ అవార్డు వరించింది..

ఇప్పుడు దీనికి సీక్వెన్స్ లో పుష్ప 2 నిర్మాణం జరుగుతుంది.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయింది.. కాగా పుష్ప లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా సమంత ఐటమ్ పాట తో అలరించింది.. పుష్ప 2 లో కూడా పుష్ప సినిమా కి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ఐటమ్ సాంగ్ ని పెట్టాలని డైరెక్టర్ సుకుమార్ భవింస్తున్నారని, ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు బాలీవుడ్ భామలని సంప్రదించగా వాళ్ళు నో చెప్పారని సినీ వర్గాల సమాచారం.. అయిన డైరెక్టర్ సుకుమార్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఐటమ్ సాంగ్ స్టార్ హీరోయిన్ తోనే చేయించాలని భవిస్తూ హీరోయిన్ కోసం వెతుకుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి..

కాగా తాజాగా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 కి సంబంధించిన ఒక టీజర్ ని విడుదల చేసారు.. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ అమ్మవారి రూపంలో కనిపిస్తున్నారు.. దీనితో ఈ చిత్రం పైన ప్రేక్షకులలో అంచనాలు పెరుగుతున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here