josh ravi : ఖాళీగా అయినా ఉంటాను… జబర్దస్త్ కంటెంట్ గా మాత్రం చెయ్యను

0
76

జబర్దస్త్ ఈ కార్యక్రమం పేరు వినని వాళ్ళంటూ ఉండరు.. అంతలా విజయవంతం అయినది.. అంతేకాదు ఎందరికో జీవితాన్ని కూడా ఇచ్చింది.. జబర్దస్త్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా చేసి గుర్తింపు పొందినవాళ్లు ఎందరో ఉన్నారు.. వెండితెర హీరోలకి హీరోయిన్లకి ఏ మాత్రం తీసిపోని వింధంగా ప్రేక్షకాభిమానులని ఏర్పరుచుకున్నారు.. అలాంటి జబర్దస్త్ షోలో కంటెస్టెంట్ గ మాత్రం చెయ్యనని తెగేసి చెప్తున్నాడు జోష్ రవి..

జోష్ రవి అక్కినేని నాగార్జున తనయుడు నటించిన తొలి చిత్రం జోష్ లో విలన్ గ్యాంగ్ లో తిరిగే కమెడియన్ పాత్రతో తెరంగేట్రం చేసాడు రవి.. ఆ సినిమాలో గోడపైన కూర్చుని వచ్చి పోయే వాళ్ళని కామెంట్స్ చేస్తూ ఉండే విద్యార్థి పాత్రలో నటించాడు.. ఆ సినిమాలో తన పాత్రకి మంచి పేరు రావడంతో రవి కాస్త జోష్ రవి గా మారాడు.. తాజాగా జేడీ చక్రవర్తి నటించిన దయ సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉన్న హీరో తమ్ముడి పాత్రలో నటించి మెప్పించిన జోష్ రవి తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన అభిప్రాయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు..

దాదాపు 100 కు పైగా చిత్రాలలో నటిస్తే గుర్తింపు తెచ్చిన సినిమాలు మాత్రం కేవలం 20 అని పేర్కొన్నారు .. గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో తను పోషించిన గే పాత్రకి మంచి ఆదరణ లభించిందని.. రవి తేజ ఫోన్ చేసి మెచ్చుకుంటే నాకు కన్నీళ్లు ఆగలేదని తెలిపారు..

నాకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయని వాటినే వినియోగించుకుంటానని.. జబర్దస్త్ కామెడీ షో అంటే తనకి చాల గౌరవమని.. ఇంతక ముందు కొన్ని సార్లు గెస్ట్ రోల్స్ చేశానని.. ఇప్పుడు కూడా గెస్ట్ గా అయితే చేస్తానని కానీ కంటెస్టెంట్ గా మాత్రం చెయ్యనని ఎందుకంటే నాకు సినిమాలే ముఖ్యం అని వెల్లడించారు..ఖాళీగా అయినా ఉంటానుగాని జబర్దస్త్ కంటెస్టెంట్ గా మాత్రం చెయ్యను ఎందుకంటే నేను సినిమాల ద్వారా వెండి తెరకు పరిచయమయ్యా.. కావున నాకు బుల్లి తెర కంటెస్టెంట్ గా చెయ్యాలని లేదని తన అభిప్రాయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here