వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ యువతని ఉర్రూతలూగించిన అలనాటి అందాల తార సదా.. టాలీవుడ్, కోలీవుడ్ ఇలా పలుభాషల్లో నడిచి మెప్పించిన ఈ ముదురు భామ.. ఇప్పుడు అవకాశాలు తగ్గడం తో ఓటిటి చిత్రాలలో నటించడంతో పాటుగా బుల్లి తెరపైన కూడా మెరుస్తూ తన అంధ చందాలతో అదరగొడుతుంది..
ఒకప్పుడు ఈ టీవీ డాన్స్ షో “డి” లో జడ్జిగా శేఖర్ మాస్టర్ తో కలిసి స్టెప్పులేసి సదా ఇప్పుడు “నీతోనే డాన్స్” అనే షోకి జడ్జీగా వ్యవహరిస్తున్నారు.. ఈ షోలో అలనాటి అందాల నటి రాధా మరియు డాన్స్ మాస్టర్ తరుణ్ మాస్టర్ తో కలిసి సందడి చేస్తున్నారు.. కాగా ఈ షో ప్రస్తుతం సెమీ ఫైనల్ వరకు వచ్చింది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ అందరూ.. తమకు నచ్చిన థీమ్ తో అదరగొడుతున్నారు. అయితే ఈ షోకి సంబంధించిన ఒక ప్రోమో ఇప్పుడు హల్చల్ చేస్తుంది.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగ కంటెస్టెంట్స్ కొందరు దేశభక్తి గీతాలతో రాగ అంజలి- పవన్ జంట మాత్రం హర్రర్ థీమ్ తో వచ్చారు. అందులో అంజలి దెయ్యంగా కనిపించగా.. దెయ్యం నుంచి తప్పించుకొనే యువకుడిగా పవన్ కనిపించాడు.
ఇక ఈ సాంగ్ కి గాను అంజలి వేసుకున్న మేకప్ అతి క్రూరంగా.. చూసిన వెంటనే ఒళ్ళు జలదరించేల ఉంది.. అది చూసిన సదా ఒక్కాసారిగ భయాన్దోలనకు గురయ్యారు.. భయంతో ఆ యాక్ట్ ని ఆపమంటూ కేకలు పెట్టారు.. సెట్ లో తన కేకలు మారుమ్రోగాయి.. అంజలిని తన దగ్గరకి రావొద్దని.. తాను చాల సెన్సిటివ్ అని సద అరుస్తున్న ప్రోమో వైరల్ గా మారింది.. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు వేచి ఉండాలి.. మరి నిజంగ సదా భయపడ్డారా..? లేక ట్.ఆర్.పి కోసం స్టంట్ ఆ అనేది ఎపిసోడ్ చూస్తేగాని తెలియదు..