దిగ్గజ నటులు అల్లు రామలింగయ్య మనవడు.. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అయిన అల్లు అర్జున్ గురించి పరిచయం అక్కర్లేదు.. సినీ నేపధ్యం ఉన్న కుట్టుబ్బం నుండి వచ్చిన టాలెంట్ ఉంటేనే చిత్ర పరిశ్రమలో రానించగలరు.. లేకుంటే లేదు.. గంగోత్రి సినిమా లో అల్లు అర్జున్ న్ని చూసి అసలు ఇతను హీరో నా అని హేళన చేసిన విమర్శకులనుండే హీరో అంటే ఇలా ఉండాలి అనే ప్రశంసల్ని అందుకున్నారు అల్లు అర్జున్..
ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు అల్లు అర్జున్..అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన వర్ణాతీతంమనే చెప్పాలి.. అసలు చింతూరు యాసలో డైలాగు చెప్పడం, బాడీ లాంగ్వేజ్, అసలు ఈ చిత్రంలో అల్లు అర్జున్ నట్టించలేదు జీవించాడనే చెప్పాలి అన్నారు సినిమా చూసిన వాళ్ళు.. అది వాస్తవమే అని తెలిసేల పుష్ప సినిమాకు గాను రెండు జాతీయ అవార్డులు వచ్చాయి..
తాజాగా పుష్ప సినిమాకి గాను బెస్ట్ ఆక్టర్ గా అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు వచ్చింది.. ఈ విషయం తెలియగానే బన్నీ చాలాసేపు నమ్మలేదు.. చివరికి అది నిజం అని తెలుసుకున్న బన్నీ తన ఆనందాన్ని తన కుటుంబ సభ్యులతో పంచుకున్నారు.. ఈ సంతోషకరమైన వార్త విన్నాక అల్లు అర్జున్ తన తండ్రి అయిన అల్లు అరవింద్ ఆశీర్వాదం తీసుకుని ముద్దు పెట్టుకున్నారు..అలానే తన పిల్లలని కూడా ముద్దాడి తన సంతోషాన్ని పంచుకున్నారు.. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..