లక్కీ గర్ల్.. మొదటి లాటరీకే రూ. 290 కోట్ల జాక్‌పాట్

0
406

అదృష్టం అంటే ఈ కెనడా అమ్మాయిదే. సరదాగా తొలిసారి కొన్న లాటరీ టికెట్ ఆమెపై కోట్ల వర్షాన్ని కురిపించింది. ఏకంగా రూ.290 కోట్లు జాక్ పాట్ ఆ అమ్మాయిని వరించింది. కెనడాకు చెందిన 18 ఏళ్ల అమ్మాయి తొలిప్రయత్నంలోనే భారీ లాటరీ తగిలింది. కెనడా అంటారియోకు చెందిన జూలియెట్ లామర్ కు ఈ భారీ లాటరీని గెలుచుకుంది. డ్రాలో గెలుపొందాననే వార్త వినేంత వరకు తాను లాటరీ టికెట్ కొన్న సంగతినే మరిచిపోయానని చెప్పింది. జాక్ పాట్ లో వచ్చిన డబ్బును జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తానని చెప్పుకొచ్చింది.

18 ఏళ్ల జూలియట్ లామర్ అతి చిన్న వయసులోనే 48 మిలియన్ డాలర్ల భారీ లాటరీని గెలుచుకున్నట్లు అంటారియో లాటరీ అండ్ గేమింగ్ కార్పొరేషన్ ప్రకటించింది. కెనడా లాటరీ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తాన్ని గెలుచుకున్న అతిచిన్న వయస్కురాలిగా జూలియట్ లామర్ రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి లాటరీ టికెట్టుకే ఇంత పెద్ద జాక్ పాట్ తగలడం ఆమెకే చెల్లింది. జనవరి 7న జరిగిన డ్రాలో లామర్ గెలిచింది.

సరదాగా మా తాత లాటరీ టిక్కెట్టు కొనాలని సూచించాడని లామర్ తెలిపింది. నేను స్టోర్ కు వెళ్లిన సమయంలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా టిక్కెట్టు కొన్న అనుభవం లేకపోవడంతో ఏం అడగాలో నాకు తెలియలేదని ఆమె వెల్లడించింది. దీంతో మా నాన్నకు ఫోన్ చేసిన తర్వాత లోట్టో 6-49 క్విక్ పిక్ కొనమని చెప్పాని తెలిపింది. నా మొదటి లాటరీ టిక్కెట్టుకే ఇంత పెద్ద జాక్ పాట్ కొట్టడాన్ని నేను నమ్మలేకపోతున్నానని లామర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను యూనివర్సిటీలో చదువుతున్నా అని.. చదువు ముగించాలని యోచిస్తున్నట్లు, సమ్మర్ హాలీడేస్ ప్లాన్ చేస్తున్నట్లు లామర్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here