టైటానిక్.. ఈ పేరు వినగానే ఒళ్ళు గగుర్పొస్తుండుస్తుంది.. ఎందుకంటే ప్రపంచంలో కనివిని ఎరుగని ప్రమాదానికి గురై వందలమందిని జల సమాధి చేసిన ఘటన.. శతాబ్దాలు గడిచినా ఇప్పటికి మరుపురాని దుర్ఘటన టైటానిక్ సంఘటన.. ప్రపంచం లోనే అత్యంత భారీ నౌక టైటానిక్ 1912 ఏప్రిల్ 14 వ తేదీన మంచుకొండని ఢీకొని ప్రమాదానికి గురికాక ఈ ప్రమాదంలో 1517 మంది మృతి చెందారు.. రెండు ముక్కలు గా విరిగి మునిగిపోయింది టైటానిక్.. 1985 రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వంలో మొదటిసారిగా టైటానిక్ అవశేషాలు కనుగొనబడ్డాయి.. అప్పటినుండి సాగర సహస యాత్రికులు ఆ టైటానిక్ ఉన్న ప్రదేశానికి ప్రాణాలకి తెగించి వెళ్లి వస్తుంటారు..
అయితే ఈ మధ్యకాలంలో ఓషన్ గేట్ సంస్థ టైటానిక్ అవశేషాలను చూపిస్తామని 5 మంది సంపన్నుల నుండి కోట్ల రూపాయలని తీసుకొని వాళ్ళని టైటాన్ సుబ్మెర్సిబుల్ లో టైటానిక్ సందర్శనార్దం పంపింది.. అయితే దురదృష్టవశాత్తు ఆ 5 మంది మృత్యువాత పడ్డారు.. ఇందులో ఆ సంస్థ వ్యస్థాపకులు కూడా ఒక్కరు.. ఇందులో 21 సంవత్సరాలు కూడా నిండని యువకుడు కూడా మృతి చెందండం యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది..
ఈ ప్రమాదానికి కారణం ఓషన్ గేట్ సంస్థ అని అందరి అభిప్రాయం.. సరైన భద్రత ప్రమాణాలు పాటించకుండా.. పైసలకోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుందని యావత్ ప్రపంచం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.. టైటానిక్ శిధిలాలు అట్లాంటిక్ మహాసముద్రంలో 4000 వేల అడుగుల లోతులో ఉన్నాయి.. అంత లోతులో పీడనం అధికంగా ఉంటుంది.. ఆ లోతుకి వెళ్లేసరికి అధిక పీడనం వల్ల సబ్ మెర్సిబుల్ వత్తిడికి గురై పేలిపోయింది.. ౩ రోజుల పాటు వాళ్ళ కోసం రెస్క్యూ సిబ్బంది ఎంత ప్రత్నించిన లాభం లేక పోయింది.. యావత్ ప్రపంచం ఆ 5 మంది ప్రాణాలతో తిరిగి రావాలని ఆశపడితే ఆ ఆశ అడియాసగా మిగిలిపోయింది..
ఈ సంఘట జరిగి ఎంతో కాలం కాలేదు.. ఇప్పటికి ప్రజలు ఈ సంఘటన గురించి చర్చించుకుంటూనే ఉన్నారు.. అయితే ఓషన్ గేట్ సంస్థ మళ్ళీ టైటానిక్ యాత్రకి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.. ఓషన్ గేట్ సంస్థ తన వెబ్‌సైట్‌లో తర్వాతి టైటానికి ట్రిప్ కు సంబంధించిన ప్రకటనను కొనసాగిస్తోంది.. కంపెనీ 2024 జూన్ 12-20 మరియు జూన్ 21-29 వరకు రెండు విహారయాత్రలను ప్లాన్ చేస్తోంది. వెబ్‌సైట్ ప్రకారం, 8 డేస్-7 నైట్స్ ప్రయాణానికి ఒక్కొక్కరికి 250,000 డాలర్లు ఖర్చవుతుందని ప్రకటించింది. ఒక సబ్‌మెర్సిబుల్ డైవ్, ప్రైవేట్ వసతి, అవసరమైన అన్ని శిక్షణ, సాహసయాత్రతో పాటు అన్ని భోజన సదుపాయాలు ఈ ప్యాకేజీలో ఉంటాయని పేర్కొంది. సరైన భద్రత ప్రమాణాలు పాటించకుండా ఐదుగురి నిండు ప్రాణాలను బలితీసుకుంది సరిపోనట్లు మళ్ళీ ట్రిప్పుకి సన్నాహాలు చేస్తున్నారా అని ఓషన్ గేట్ సంస్థ పైన పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.